కమాన్ పూర్
ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ కు అంబేద్కర్ జిల్లా పేరుపెడుతే వ్యతిరేకించడం వెనుక అరాచక శక్తులకుట్ర దాగి ఉందని, అరాచక శక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును చిరకాలంగా నిలబెట్టుకోవాల్సినబాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, మహిళలుఅణగారిన వర్గాల ప్రజలపై ఉందనిగుర్తుచేస్తున్నాం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అవార్డు గ్రహీత కమాన్పూర్ మండల జూలపల్లి గ్రామవాసి అంబేద్కర్ సంఘ నాయకులు ఇరుగు రాళ్ల శ్రీనివాస్ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న ప్రపంచ మేధావిగా పేరు గాంచిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును కోనసీమ కు పెట్టడాన్ని సహించలేని కొన్ని అరాచక శక్తులు విధ్వంసాలు సృష్టించిచడం దారుణమని అరాచక శక్తులను కఠినంగా శిక్షించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
కోనసీమ కు అంబేద్కర్ పేరును పెట్టాలని గతకొంతకాలంగా అక్కడ స్థానిక అన్ని వర్గాల ప్రజలు,దళిత ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి,తీరా కోనసీమ కు అంబేద్కర్ పేరును పెట్టిన తర్వాత విధ్వంసాలకు తెగబడడం చూస్తుంటే దీని వెనుక భయంకరమైన కుట్ర దాగి ఉందని కుట్రను చేదించి అరాచక శక్తులను కఠినంగా శిక్షించే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదే నని గుర్తు చేస్తున్నాం.
పాముచిన్నదైనా కర్ర పెద్దది ఉండాలని కుట్రదారులుఎవరైనా,ఎక్కడైనా తరిమి కొట్టడానికి అణగారిన వర్గాల ప్రజలు సిద్దంగా ఉండాలని పిలుపునిస్తున్నాం