నెల్లూరు
నెల్లూరు నగరంలోని టవున్ హాల్ సమీపంలో నిన్న సాయంత్రం కత్తిపోట్లకు గురైన విజయ్ కుమార్ (29)అనే యువకుడు ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గురువారం సాయంత్రం దుండగుల కత్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ విజయ్ కుమార్ ను పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. మనుమసిద్దినగర్ లో తల్లితండ్రులు తో కలిసి నివాసం వుంటున్న అవివాహితుడైన విజయ్ కుమార్ అనే యువకుడు దండు వారి వీధి లోని ఒక వస్త్ర దుకాణం లో పనిచేస్తున్నాడు. మూడు సంవత్సరాలు క్రితం వినాయక చవితి సందర్భంగా మృతుడు విజయ్ తమ్ముడిని కైజర్, మసూద్, దాదా నిష్కారణంగా కొట్టడంతో వీరి ముగ్గురు పై విజయ్ తల్లితండ్రులు కేసు పెట్టగా ఆ కేసు కోర్టులో నడుస్తూ వుంది. ఈ క్రమంలో కేసు వాపసు తీసుకోవాలని ఈ ముగ్గురు నిందితులు కొన్ని నెలలుగా కత్తులతో మా ఇంటి మీదకు రావడం,మమ్మల్ని వేదింపులు కు గురిచేయడం చేస్తున్నారు. మేము భయపడి కేసు వాపసు కూడా తీసుకుంటాము అని చెప్పినా ఆ దుర్మార్గులు నిన్న మా బిడ్డను నడి రోడ్డు పై పొడిచి చంపేశారు అని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.....