ఒంగోలు మే 27
రాష్ట్ర ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చే పార్టీ టీడీపీ అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. మహానాడు పేరంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని అన్నారు మహానాడు అనేది తెలుగుజాతికి ఒక పండగ అని స్పష్టం చేశారు. పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు లో ఇవాళ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహానాడు పేరంటే గుర్తొచ్చేది ఎన్టీఆర్ అని అన్నారు.‘ గడిచిన మూడేళ్లుగా చాలా ఇబ్బందులు పడ్డాం. నాయకులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన రోజున నిద్రలేని రోజులు గడిపాను. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారని’ కొనియాడారు.ఏపీలో అధికారంలోకి వచ్చిన వారు కరడుగట్టిన నేరస్తులని, తప్పులు చెప్పి రాజకీయం చేసిన వ్యక్తులని వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.‘ వైసీపీ నాయకులు చరిత్రహీనులని నిరూపించేంతవరకు పోరాటం ఆగదని’ బాబు అన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడే పార్టీలపై ప్రభుత్వం దాడులు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర పోలీసుల్లో మార్పు రావాలని కొంతమంది కోసం మీ వ్యక్తిత్వాన్ని త్యాగం చేయవద్దని పోలీసులకు సూచించారు.‘డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు ఆలోచించుకోవాలని, అనవసరంగా ఉన్మాది చేతిలో బలి కావొద్ద’ని తెలిపారు. పార్టీ నాయకులు,కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజలకు వివరించాలని సూచించారు. పెట్రో ధరలు కేంద్రం తగ్గిస్తే ఏపీ ప్రభుత్వం తగ్గించలేదని ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేస్తే భగవంతుడు ఆశీర్వదిస్తారని తెలిపారు.