YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తీహార్ జైలు నుంచే గ్యాంగ్ స్టర్ ఆపరేషన్స్..

తీహార్ జైలు నుంచే గ్యాంగ్ స్టర్ ఆపరేషన్స్..

న్యూఢిల్లీ, మే 31,
తీహార్‌ జైల్లోనే ఉంటాడు.. కాని కంట్రీవైడ్‌గా సుపారీ కిల్లింగ్‌ కాంట్రాక్ట్‌లు తీసుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా నెట్‌వర్క్‌ ఉంది. అతడే లారెన్స్‌ బిష్ణోయ్‌. పంజాబ్‌ సింగర్‌ సిద్దూ మూసేవాలా హత్యకు జైల్లో నుంచే కుట్ర చేశాడు లారెన్స్‌ బిష్ణోయ్‌. ఢిల్లీ ‌పోలీసులు లారెన్స్‌ బిష్ణోయ్‌ను తీహార్‌ జైల్లో విచారించారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు 700 మంది షార్ప్‌ షూటర్స్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో ఉన్నారు. పంజాబ్‌ పోలీసులు నన్ను ఎన్‌కౌంటర్‌ చేస్తారు.. విచారణ పేరుతో పంజాబ్‌కు తీసుకెళ్లకుండా చూడండి.. అంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు లారెన్స్‌ బిష్ణోయ్‌. తనకు సెక్యూరిటీ పెంచాలని కోరాడు. తీహార్‌ జైల్లో నెంబర్‌ 8 హై సెక్యూరిటీ బ్యారక్‌లో ఉన్నాడు లారెన్స్‌ బిష్ణోయ్‌. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ పరిధితో పాటు హర్యానా , పంజాబ్‌ , రాజస్థాన్‌ , ఉత్తరప్రదేశ్‌లో నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు లారెన్స్‌ బిష్ణోయ్‌. అంతేకాదు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తానని కూడా బెదిరించాడు లారెన్స్‌ బిష్ణోయ్‌. తమ బిష్ణోయ్‌ సామాజిక వర్గం దైవంగా భావించే కృష్ఱజింకను వేటాడినప్పటి నుంచి సల్మాన్‌ఖాన్‌పై పగ పెంచుకున్నాడు లారెన్స్‌ బిష్ణోయ్‌.లారెన్స్‌ బిష్ణోయ్‌ స్వస్థలం పంజాబ్‌ లోని ఫిరోజ్‌పూర్‌. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి లా చేశాడు లారెన్స్‌. బిల్డర్లు , ప్రముఖ వ్యాపారులు , సినిమా నిర్మాతలు , పారిశ్రామికవేత్తలను బెదిరించి లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా కోట్ల రూపాయలు వసూలు చేస్తోంది. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరిస్తారు.లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో ఇద్దరు కీలక భాగస్వాములు ఉన్నారు. సిద్దూ మూసేవాలను హత్య చేసిందని తామేనని ప్రకటించిన గోల్డీ బరార్‌ ఇందులో ఒకడు. ఈ ముఠాలో మరో కీలక గ్యాంగ్‌స్టర్‌ కాలా జతేడి కూడా తీహార్‌ జైల్లోనే ఉన్నాడు. తీహార్‌ జైల్లో ఉన్నప్పటికి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు లారెన్స్‌ బిష్ణోయ్‌ . ఫేస్‌బుక్‌లో ఎప్పటికప్పుడు పోస్ట్‌లు పెడుతుంటాడు. పోలీసుల సహకారం తోనే లారెన్స్‌ బిష్ణోయ్‌ జైల్లో స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగిస్తునట్టు ఆరోపణలు వస్తున్నాయి.బెదిరింపులు మరియు రాకెట్ రన్నింగ్ గురించి ఇటీవలి కాలంలో తరచుగా వార్తలు వస్తున్నాయి. పరీందా కూడా చంపలేని జైళ్లలో ఖైదీలు నిర్భయంగా మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. నేరగాళ్లకు ఈ జైళ్లు సురక్షిత స్థావరాలుగా మారడం కనిపించింది. రోహిణి కోర్టులో జితేంద్ర గోగీని హతమార్చడం, మండోలి జైలులో ఉన్న కుల్దీప్ పరారీకి ప్లాన్ చేయడం జైళ్లలోనే జరిగింది. దుండగుల సుకేష్ చంద్రశేఖర్ కూడా జైలు లోపల నుంచే తన రాకెట్‌ను నడిపేవాడు. ఇప్పుడు ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాల హత్యకు కూడా జైలుకే సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

Related Posts