పల్నాడు
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్నటాటా ఏస్ వాహానం.. రెంటచింతలోని కరెంట్ ఆఫీస్ వద్ద ఆగి ఉన్న లారీ ను ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో వాహనం పల్టీ కొట్టింది. దీంతో అందులో కిక్కిరిసి ప్రయాణిస్తున్న వారాంత ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ ఘటనలో అక్కడికక్కడే 9 మంది మృతి చెందారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాద సమయంలో టాటా ఎస్ వాహనంలో 38 మంది ప్రయాణీకులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదానికి కారణం చీకటితో పాటు..డ్రైవర్ రహదారిపై ఆగి ఉన్న ఉన్న లారీని గమనించకపోవడంతో ప్రమాదం జరిగింది.