YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడపలో కాంగ్రెస్ చింతన సదస్సు

కడపలో కాంగ్రెస్ చింతన సదస్సు

కడప
జూన్ 4,5 తేదీల్లో కడప ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నవ సంకల్ప చింతన సదస్సు జరుగుతుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి అన్నారు. ఈ సదస్సులో సంస్థాగత , రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ, సామాజిక సాధికారత, యువత అంశాలపై చర్చించి , కడప డిక్లరేషన్ ప్రకటించడం జరుగుతుంది. క్విట్ దుష్ట చతుష్టయం (బిజెపి, వైకాపా, టిడిపి, జనసేన)- సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఈ సదస్సు ప్రధాన లక్ష్యం. జగన్ మూడేళ్ల పాలనలో అప్పులు ఫుల్ - అభివృద్ధి నిల్ సంక్షోభంలో సంక్షేమం ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.8 లక్షల కోట్లు. ఇందులో జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.5 లక్షల కోట్లు. శ్రీలంక ఆర్థిక పరిస్థితి కంటే, ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థతి దారుణంగా ఉంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటు పడింది. అమ్మ ఒడి నాన్న బుడ్డి కి చాలడం లేదని అన్నారు.

Related Posts