అహ్మదాబాద్ మే 31
పటీదార్ ఉద్యమ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ మాజీ నేత హార్దిక్ పటేల్ జూన్ 2న బీజేపీలో చేరనున్నట్లు ధ్రువీకరించారు. 2019లో కాంగ్రెస్‌లో చేరిన హార్దిక్ పటేల్.. 2020, జూలై 11న గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకమయ్యారు. ఆ తర్వాత పార్టీ అధిష్టానం, నాయకత్వం తీరుపై విసుగు చెంది రాజీనామా చేశారు.ఈ సమయంలో పార్టీ హైకమాండ్‌పై విరుచుకుడ్డారు. ‘క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో ఉండాల్సిన వేళ మన నాయకుడు విదేశాల్లో ఉన్నారు’ అంటూ ఆయన రాహుల్ గాంధీని ఉద్దేశించి సోనియాకు రాసిన లేఖలో ప్రస్తావించారు. ‘అగ్ర నాయకులను నేను కలిసినప్పుడు.. వారు గుజరాత్‌కు సంబంధించిన సమస్యలను వినకుండా ఫోన్లతో గడిపారు’ అంటూ రాజీనామా లేఖలో కాంగ్రెస్ నాయకత్వం తీరును తప్పుబట్టారు. కాంగ్రెస్ నాయకత్వం గుజరాత్ పట్ల తీవ్ర విముఖతతో ఉందని, రాష్ట్రం పట్ల వారికి ఆసక్తి లేదు’ అంటూ ఆరోపించారు. ప్రజల ముందుకు వెళ్లడానికి సరైన కార్యచరణ లేకపోవడంతో.. ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించారని విమర్శించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ముందు హార్దిక్ పటేల్ పార్టీని వీడడంతో కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ నిపుణులు పేర్కొంటున్నారు. హర్దిక్ ఈ నెల 18న కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.