విశాఖపట్నం
విశాఖపట్నం పోర్టు వ్యాపార లావాదే వీల్లో చరిత్ర సృష్టిస్తోందని కేంద్ర షిప్పింగ్, జల రవాణా, ఆయుష్ శాఖా మంత్రి సర్బానంద సోనోవల్ వెల్లడించారు. దేశంలోని పోర్టుల ప్రగతిపై వివరించిన ఆయన ఇండియాలోని పోర్టుల్లో వైజాగ్ పోర్డు కార్గో హ్యాండ్లింగ్‌లో అగ్ర స్థానంలో ఉందన్నారు. గతిశక్తి పథకం ద్వారా 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ మోడీ 2035 నాటికి లక్ష్యంగా పెట్టుకున్నార న్నా రు. దేశంలోని మేజర్ పోర్టుల్లో 2014లో 16 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ ఏటా జరిగితే 2022 నాటికి 105 మిలియన్ టన్నులకు చేరుకోగలి గామన్నారు. కార్గో హ్యాండ్లింగ్‌లో ఇండియా చాలా వేగంగా వృద్ధి సాధిస్తుందని తెలిపారు. సాగర మాల ప్రాజెక్ట్ ద్వారా ఏపీ పోర్టులను ఆధునికీకరిస్తున్నామన్నారు. సాగర మాల అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమ్మేళనంతో పని చేస్తోందని, పోర్టుల అభివృద్ధి కోసం ఇది నడుస్తుందని చెప్పారు. త్వరలోనే విశాఖపట్నం నుంచి సీ -క్రూజ్ షిప్పింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. విశాఖపట్నం గ్లోబల్‌సిటీగా మారుతున్న నేపథ్యంలో టూరిజం పరంగా అభివృద్ధి చెయ్యడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఎమ్‌డి విక్టర్ నియామకం గురించిన వివాదంలో అంతర్గత విచారణ జరుగుతుందని చెప్పారు.