విశాఖపట్నం
తెలంగాణ వ్యక్తులకు ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్లు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ విశాఖలో ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ వినూత్న రీతిలో ఆందోళన చేపట్టింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్థానికులను కాదని తెలంగాణ వారికి సీటు ఇవ్వడం పట్ల నిరుద్యోగ జేఏసీ కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. పెద్దల సభలో స్థానికేతరులను కూర్చోబెట్టడం వల్ల ఉత్తరాంధ్రకు ఏళ్లతరబడి అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఏపీకి ప్రత్యేక హోదా విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ పోలవరం నిధులు విశాఖ ఉక్కు గనులు కడప స్టీల్ ప్లాంట్ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆంధ్రప్రదేశ్లో ఉన్నవారికి రాజ్యసభ సీట్లు కేటాయించాలని లేనిపక్షంలో అన్ని పార్టీలను కలుపుకుని ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కై పూనుకుంటామని హెచ్చరించారు.