YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రైతే.. దేశానికి వెన్నెముక

రైతే.. దేశానికి వెన్నెముక

కడప
దేశానికి వెన్నెముక అయిన రైతు క్షేమంగా ఉంటేనే.. రాజ్యం సుభిక్షంగా ఉంటుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించిన మాటలు.. అక్షర సత్యాలు అని..  జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అభివర్ణించారు.మంగళవారం సిమ్లాలో గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్రమోడీ.. దేశ వ్యాప్తంగా అన్ని కృషీ విజ్ఞాన కేంద్రాల్లో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్బంగా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 11వ విడత పిఎం-కిసాన్ పథకంలో భాగంగా.. దేశ వ్యాప్తంగా 10 కోట్ల మందికి పైగా  లబ్దిదారులకు రూ. 21 వేల కోట్ల నిధులను వారి ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ సభా భవన్ నుండి జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు తోపాటు.. జేసీ సాయికాంత్ వర్మ, డిఆర్వో మాలోల, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్షి రాణి, అడా చైర్మన్ గురు మోహన్, రాష్ట్ర మరాఠా సంఘం సభ్యురాలు రజని.. లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ప్రధాన మంత్రి అవాజ్ యోజన, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, పోషణ్ అభియాన్, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, స్వచ్చ భారత్ మిషన్, జలజీవన్ మిషన్ మరియు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఆయుష్ భారత్ పి.ఎం.జన ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్, ప్రధాన మంత్రి ముద్రా యోజన పధకాలకు సంబంధించి అన్ని రాష్ట్రాల లబ్దిదారులతో వర్చువల్ విధానంలో  ప్రధానమంత్రి మాట్లాడారు. ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం.. జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు మాట్లాడుతూ.. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. రైతు సంక్షేమం కోసం పెద్దపీట వేశయన్నారు. కేంద్ర ప్రభుత్వం "పిఎం-కిసాన్" సమ్మాన్ పథకం ద్వారా 11వ విడతగా జిల్లాలో "పిఎం కిసాన్ సమ్మాన్" క్రింద 1,98,000 మంది లబ్దిదారులకు  రూ.37,88,00,000 లు మొత్తాన్ని ప్రధాని రైతుల ఖాతాల్లో జమ చేయడం సంతోషించదగ్గ విషయం అన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తోన్న ఈ సాయం..  రైతుల వ్యవసాయ సాగు పెట్టుబడికి ఎంతో ఉపకరిస్తోందన్నారు. అంతేకాకుండా.. వ్యవసాయంపై రైతుల్లో మరింత మక్కువ పెరిగిందన్నారు. గ్రామ సీమలో రైతులు సాగుబడిని పండుగ వాతావరణంలోచేపడుతున్నారన్నారు. ఈ ఏడాది.. ప్రకృతి కరుణించి అనుకున్న సమయానికంటే ముందుగానే రుతుపవనాలు కూడా రానున్నాయని.. ఆ దిశగా ఖరీఫ్ సాగుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను సమాయత్తం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు, ఏపీఎంఐపీ పీడి మధుసూధన రెడ్డి, ఎల్డిఎం దుర్గాప్రసాద్, ఎన్.ఐ.సి. సెంటర్ అదనపు డి.ఐ.ఓ. ఏపి సత్యనారాయణ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, బిజెపి జిల్లా నాయకులు, పిఎం కిసాన్ సమ్మాన్ లబ్దిదారులైన రైతులతో పాటు వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts