YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రుషికొండ తవ్వకాలపై విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

రుషికొండ తవ్వకాలపై విచారణ రేపటికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ
రుషికొండ తవ్వకాలపై న్యాయమూర్తులు బిఆర్ గవాయ్, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  ఏపీ ప్రభుత్వం తరపున  కాంగ్రెస్ ఎంపీ, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు.  ఎన్జీటి నియమించిన మొదటి కమిటీ నివేదికలో పర్యావరణ ఉల్లంఘనలు లేవని స్పష్టం చేసిందని సింఘ్వీ అన్నారు.
అయినా ఎన్జీటి స్టే విధించి మరో కమిటీని నియమించడం సబబు కాదు.  ఏపీ ప్రభుత్వం వాదన వినకుండా స్టే ఇవ్వడం సహజ న్యాయసూత్రాలకు విరుద్దం.  సిఆర్ జెడ్-2 పరిధిలోకి రుషికొండ ప్రాజెక్టు వస్తుందని ఎన్జీటి మొదటి కమిటీ చెప్పింది.  ఇప్పడు సిఆర్ జెడ్ -3 నిబంధన అమలు అవుతుందా? లేదా? అన్న అంశాన్ని పరిశీలించాలని ఎన్జీటి కోరుతుందని సింఘ్వీ అన్నారు.
తుది తీర్పుకు కట్టుబడి ఉంటారా? అని ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.  ఆ మేరకు హామీ పత్రం ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.  ఏపీ హైకోర్టు గతంలో రెండు సార్లు స్టే ఇవ్వడానికి నిరాకరించిన అంశాన్ని సీనియర్ కౌన్సిల్ సింఘ్వీ కోర్టు దృష్టికి తెచ్చారు. ★ ప్రతివాది ఎంపీ రఘురామ తరపు వాదనలను వినడానికి ధర్మాసనం రేపటి వరకూ సమయం ఇచ్చింది.  తదుపరి విచారణ రేపటికి వాయిదా వేసింది.

Related Posts