YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

బిగ్ బాస్ హోస్ట్ గా నాని

బిగ్ బాస్ హోస్ట్ గా నాని

బిగ్‌బాస్ సీజన్ 2 హోస్ట్ ఎవరన్నదానిపై క్లారిటీ ఇస్తూ స్టార్ మా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. తొలి నుండి ప్రచారంలో ఉన్న నేచులర్ స్టార్ .. బిగ్ బాస్ తెలుగు సీజన్‌2 హోస్ట్ చేస్తున్నట్టుగా ఫస్ట్‌లుక్‌తో పాటు.. నానిపై ప్రత్యేకించి రూపొందించిన రెండున్నర నిమిషాల ప్రమోషన్ వీడియోను విడుదల చేశారు. హోస్ట్‌గా స్టన్నింగ్ గెటప్‌తో నేచురల్ స్టార్ అదరగొడుతున్నాడు.  ఇక ప్రమోషన్ వీడియోలో ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలిరా.. పేరు చెప్పు అని అనగానే.. నాని అన్నా అంటూ చిన్న పిల్లాడు అరుస్తూ వెళ్లడం.. నాని వీరలెవల్లో ఎంట్రీ ఇచ్చి బాబాయ్.. ఈసారి ఇంకొంచెం మసాలా అంటూ టీ తాగుతూ అదుర్స్ అనిపించారు. చిటికె వేసి మరీ.. ఏదైనా జరగొచ్చని హోస్ట్ చైర్‌లో కూర్చొని బిగ్ బాస్ రియాలిటీ షో సెట్‌లో కూల్‌గా చాయ్ తాగుతున్నాడు నాని. ఏ ఇమేజీ లేకపోవడమే నానీ ప్లస్‌ పాయింట్‌. ఏ గ్లాసులో పోసినా, ఆ షేప్‌లో కనిపించే లిక్విడ్‌ సెల్యులాయిడ్‌ ఈ కుర్రాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో ఫిలాసఫీతో టచ్‌ చేశాడు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ను సున్నితంగా లాక్కొచ్చాడు. ‘జెంటిల్‌మన్‌’లో అయితే ఇంకో నానీని చూపించాడు. హీరోనా, విలనా తెలియని కన్‌ఫ్యూజన్‌లో పడేశాడు! అంటే ఏదిచ్చినా అది వన్‌ మేన్‌ షోలా చేసేస్తున్నాడు నానీ. ఇప్పుడు బిగ్‌బాస్‌ను కూడా హోస్ట్‌ చేసేస్తాడు. నో డౌట్‌. మొదటి సీజన్లో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు రాజమౌళితో తీయబోతున్న మల్టీస్టారర్, త్రివిక్రమ్ సినిమాల్లో నటించబోతుండడంతో డేట్లు కుదరక హోస్ట్ కి  నో చెప్పేసాడు.ఎన్టీఆర్ తప్పుకోవడంతో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

Related Posts