YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆత్మకూరులో వైసీపీ నెత్తిన పాలు

ఆత్మకూరులో  వైసీపీ నెత్తిన పాలు

నెల్లూరు, జూన్ 4,
బీజేపీ ముందు నుంచీ చెబుతున్నట్లుగానే ఆత్మకూరులో అభ్యర్థిని పోటీలో నిలబెట్టి  అధికార వైసీపీ నెత్తిన పాలు పోసింది. ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ యాదవ్ ను రంగంలోనికి దింపింది. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. మేకపాటి కుటుంబీకులకే వైసీపీ టికెట్ ఇవ్వడంతో ఆనవాయితీని పాటించి తెలుగుదేశం పార్టీ  పోటీకి దూరంగా ఉంది.అయితే రాష్ట్రంలో ఏ మాత్రం పొలిటికల్ స్టేక్ లేని బీజేపీ తగుదునమ్మా అంటూ ఆనవాయితీని తోసి రాజని అభ్యర్థిని నిలబెట్టింది. బీజేపీ అభ్యర్థిని నిలబెట్టడంతో ఇక్కడ పోటీ అనివార్యం అయ్యింది. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన క్షణం నుంచీ కూడా వైసీపీ ఆత్మకూరులో పోటీ జరగాలని ఆశిస్తూ వచ్చింది. ఎందుకంటే బలమైన తెలుగుదేశం పోటీకి దూరంగా ఉండటంతో ఈ నియోజకవర్గంలో పోటీ అంటూ జరిగితే వైసీపీ విజయం నల్లేరు మీద బండినడకే, అయితే మెజారిటీ విషయంలో కొత్త రికార్డులు సృష్టించుకుని.. జనంలో తమ పార్టీకీ, ప్రభుత్వానికి జనాదరణ ఏమాత్రం తగ్గలేదు సరికదా, మరింత పెరిగిందని చెప్పుకునే వీలుంటుంది.అలాంటి వీలును అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా బీజేపీ వైసీపీకి ఇచ్చిందని పరిశీలకులు అంటున్నారు. అయితే ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని నిలబెట్టడానికి బీజేపీ నానా యాతనలూ పడాల్సి వచ్చింది. పార్టీ తరఫున అభ్యర్థే దొరకక మల్లగుల్లాలు  తొలుత బిజవేముల రవీంద్రరెడ్డిని బీజేపీ అభ్యర్థిగా రంగంలోనికి దింపాలని భావించినా, పోటీ అనే సరికి ఆయన మొహం చాటేశారు. దీంతో పోటీ చేయడానికి అభ్యర్థి ఎవరూ దొరకని పరిస్థితుల్లో  బీజేపీ  పార్టీ జిల్లా అధ్యక్షుడిని రంగంలోనికి దింపింది. అయితే పరిశీలకులు మాత్రం ఇక్కడ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ వచ్చినా గొప్పేనని వ్యాఖ్యానిస్తున్నారు.
టీడీపీ దూరం
వైసీపీ సర్వ నియమాలు, ఆనవాయితీలు, నిబంధనలకూ తిలోదకాలిచ్చేసింది. ప్రభుత్వం ప్రతిష్థత్మకంగా భావించి చేపట్టిన గడప గడపకూ, సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలు తుస్సు మనడంతో.. జనంలో వ్యతిరేకత బట్టబయలై ఫ్రస్ట్రేషన్ లో మునిగిపోయింది. అందుకే ఆనవాయితీ ప్రకారం ఏకగ్రీవం కావలసిన ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీకి దిగాలంటూ విపక్షాన్ని సవాల్ చేస్తోంది. బీజేపీ ఇప్పటికే పోటీకి సై అంటూ వైసీపీ నెత్తన పాలు పోసే లాంటి నిర్ణయం తీసుకుంది.బయటకు విమర్శలు, అంతర్గతంగా ఆ పార్టీకి మేలు చేయడానికి తహతహలా బీజేపీ తీరు ఉందన్న విమర్శలను కూడా ఆ పార్టీ పట్టించుకోవడం లేదు. వైసీపీ అయితే ఆత్మకూరులో పోటీ జరగాలి. తమ అభ్యర్థికి రికార్డు మెజారిటీ రావాలి, తద్వారా జనంలో తమ ప్రభుత్వ పరపతి ఇసుమంతైనా తగ్గలేదని చాటుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. అందుకే దమ్ముంటే ఆత్మకూరులో పోటీ చేయాలంటూ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతోంది.వైసీపీ సవాల్ ను తెలుగుదేశం అధినేత వైసీపీ నీచత్వానికి పరాకాష్టగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ఆత్మకూరులో తెలుగుదేశం పోటీ చేయడం లేదు అని స్పష్టం చేశారు. మరణించిన నేత కుటుంబీకుల ఎన్నికకు తెలుగుదేశం కట్టుబడి ఉందన్నారు. గతంలో బద్వేలులో కూడా ఆ కారణంగానే తెలుగుదేశం పోటీ చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు ఆత్మకూరులోనూ అదే విధానాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. ఈ సాంప్రదాయాన్ని తెలుగుదేశం గౌరవిస్తుందని, ఆచరిస్తుందని స్పష్టం చేసిన చంద్రబాబు.. ఆత్మకూరులో పోటీ అంటూ వైసీపీ చేస్తున్న సవాళ్లు నీచమని విమర్శించారు.  ప‌ద‌విలో ఉన్న నేత చ‌నిపోయిన కార‌ణంగా జ‌రిగే ఎన్నిక‌ల్లో మృతుడి కుటుంబ స‌భ్యుల‌ను ఏక‌గ్రీవంగా ఎన్నుకోవాల‌న్న సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

Related Posts