YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనంతలో ఆసక్తికర రాజకీయాలు

అనంతలో ఆసక్తికర రాజకీయాలు

అనంతపురం, జూన్ 4,
అనంతపురం టీడీపీలో నేతల స్టైలే వేరు. రాజకీయ ప్రత్యర్థులను వదిలేసి.. తమలో తామే పాలిటిక్స్‌ను రక్తికట్టిస్తారు. ఈ జాబితాలో టాప్‌లో ఉంటున్నారు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తనకు సంబంధం లేకుండా పుట్టపర్తిలో ఎలా పర్యటిస్తారని జేసీని పల్లె ప్రశ్నిస్తుంటే.. కార్యకర్తలలో భరోసా నింపడానికే వెళ్లానని బదులిస్తున్నారు ప్రభాకర్‌రెడ్డి.ఒక ప్రైవేటు స్థలంపై సాగుతున్న వివాదం.. అనంత టీడీపీలో కలకలం రేపుతోంది. అక్రమాలు నిగ్గు తేల్చుతానని జేసీ బయలు దేరితే అదేపార్టీకి చెందిన పల్లె దానిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇటీవల కాలంలో పుట్టపర్తి రాజకీయాల్లో JC జోక్యం డోస్‌ పెరిగింది. తాజాగా ఆయనకు స్థల వివాదం కలిసొచ్చింది. పుట్టపర్తిలో ఉజ్వల విల్లాల విక్రయంలో అవకతవకలు జరిగాయన్నది జేసీ ఆరోపణ. అయితే పుట్టపర్తిలో ఆయన జోక్యం ఏంటన్నది పల్లె ప్రశ్న. తనకు వ్యతిరేకంగా వర్గాన్ని ఏర్పాటు చేశారని.. మండిపడుతూ.. జేసీ పర్యటనను అడ్డుకునే యత్నం చేశారు పల్లె. దాంతో ఉద్రిక్తతలకు దారితీసింది.పల్లెకు టికెట్ ఇస్తే.. ఆయన ఖచ్చితంగా ఓడిపోతారని.. అంతేకాదు.. చంద్రబాబుకు కూడా ఓటమి తప్పదని గతంలో జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తిలో టీడీపీ కొత్త వ్యక్తికి టికెట్‌ ఇవ్వాలని చెప్పకనే చెప్పారు. ఆ కామెంట్స్‌కు అంతేస్థాయిలో బదులిచ్చారు పల్లె. నువ్వు ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచావు.. నేను మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యాను.. మంత్రిగా.. చీఫ్‌విప్‌గా పనిచేశాను అని జేసీకి కౌంటర్‌ ఇచ్చారు పల్లె. వచ్చే ఎన్నికల్లో బీఫారం తీసుకునేది కూడా తానేనని తెలిపారాయన.అయితే పుట్టపర్తిలో జేసీ జోక్యానికి చాలా కారాణాలు ఉన్నాయని చెబుతారు. తాడిపత్రిలో జేసీ కుటుంబానికి తీవ్ర వైరం ఉన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డితో పల్లె భేటీ కావడం గొడవలు తీసుకొచ్చాయి. అప్పటి నుంచి అదే పనిగా పుట్టపర్తిలో రాజకీయ అలజడి రేపుతున్నారు జేసీ. ప్రత్యేకంగా ఒక వర్గాన్ని తయారు చేసి పల్లెకు సంబంధం లేకుండా భారీ ర్యాలీలు నిర్వహించారు ప్రభాకర్‌రెడ్డి. ఇద్దరి మధ్య మొదటి నుంచి పెద్దగా వివాదాలు లేకపోయినా.. మారిన పరిణామాలు వారిని బద్ధ శత్రువుగా మార్చేశాయి. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు.. సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ గొడవలను టీడీపీ అధిష్ఠానం మౌనంగా చూస్తుందే తప్ప సయోధ్యకు యత్నించడం లేదు. మరి.. పల్లెను వదల బొమ్మాళీ వదల అని వెంటాడుతున్న జేసీ ఈ ఎపిసోడ్‌ను ఇంకెన్ని మలుపులు తిప్పుతారో చూడాలి.

Related Posts