విజయవాడ, జూన్ 4,
అభిమానం వుండొచ్చు, స్నేహం వుండొచ్చు మరీ మనోడేనని అన్ని వసతులూ కల్పించడం, దోపిడీకి వీలు కల్పించడం అసాధ్యం. కానీ శ్రీయుతులు జగన్ మొహన్ రెడ్డి విషయంలో సుసాధ్యమే. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆయనకు కావలసినవాడు అదానీ కావడమే! ఈమధ్య వైసీపీవర్గాలు అదానీ భజన కూడా చేస్తుండటమే అందుకు సాక్ష్యం! ఏకంగా రహస్య జీవో ద్వారా విశాఖలో తొమ్మిది ఎకరాలు కట్టబెట్టేశారన్నది బాగా ప్రచారంలో వుంది. అదెంతవరకూ నిజం, అలా చేయగలడా.. వంటి సందేహాలు వుండగానే ఏటా దాదాపు నాలుగున్నర వేల కోట్ల విలువైన బొగ్గు సరఫరా కాంట్రాక్ట్ అదానీకి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్షం, ప్రజలు, బిజి నెస్ వ్యవహారీకులు ఒక్కసారి గిల్లుకుని ఔను ఇది నిజమేనని నమ్మారు. దారుణం జరిగిందనీ అంటున్నారు. కారణం అందుకు సంబంధించిన టెండర్ల వ్యవహారమంతా గోల్ మాల్ గందరగోళం కావడమే.బొగ్గు కొరత వుందని, విదేశీ బొగ్గు కొనుగోలు తప్పనిసరి ప్రభుత్వం తేల్చింది. దీనికి సంబం ధించి టెండర్లు ఆహ్వానించింది. కానీ జరిగిందేమిటి? జగన్ అభిమాని అదానీ, చెట్టినాడు సంస్థలే టెం డర్లు సాధించుకున్నాయి. అదానీ 18 లక్షల టన్నులు, చెట్టినాడు సంస్థ 13 లక్షల టన్నులూ సరఫరా చేయాలి. వారికి అదేమంత పెద్ద పనిగాకపోవచ్చు. కానీ అందరినీ ఆశ్చర్యపరిచేదేమంటే అదానీ సరఫరా చేసే బొగ్గుకి టన్నుకి రూ.24,500 ఖరారు చేయడం. ఏపీ జెన్‌కో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేసే చెట్టినాడువారికి టన్ను రూ.19,500 ఖరారు చేయడం. జరిగినదేమంటే, అదానీ వాస్తవానికి టన్నుకి రూ.29,500 కోట్ చేస్తే అది రివర్స్ టెండర్లలో టన్నుకు రూ.24,500 అయింది. అదే చెట్టినాడు సంస్థకి టన్నుకి రూ.19,500 ఖరారయింది. అంటే టన్నుకి రూ.5000 చొప్పున అదానీకి లబ్ధిచేకూరేలా స్నేహ పూర్వక ఒప్పందాలు జరిగాయా? ఔను అంతా జగన్మాయ! ఎంతయినా ఏలికవారి తెలివే తెలివి. ముందుగా ఎక్కువ కోట్ చేసిన సంస్థే తర్వాత కొంత తగ్గిస్తుంది. పైగా చాలా ఆదా చేశామని ప్రభుత్వం ప్రచారంతో మద్దతుదారులను, అభిమానులను ఆకట్టుకోవడం జరిగిపోతుంది. మరో చిత్రం ఏమంటే..ప్రతీ టెండర్‌కు న్యాయసమీక్ష చేస్తామని ప్రభుత్వం చెబుతూం డడం. ఇవన్నీ చాలా మామూలుగానే జరిగిపోతుంటాయి. కానీ కావలసివారికి మార్గాలు సుగమమం చేయడం తెర వెనుక కార్యక్రమం. అసలు సంగతేమిటంటే టెండరు విలువ రూ.100 కోట్లకు మించితే న్యాయ సమీక్షకుపంపాలన్న నిబంధన తుంగలో తొక్కడం జగన్ ప్రభుత్వంవారి వల్లే అయింది. కృష్ణపట్నం అయినా.. ఏపీ జెన్ కో అయినా .. ఎంత ఎక్కువ ధర పెట్టి బొగ్గు కొంటే.. అంత ఎక్కు వగా భారం పడేది ప్రజలపైనే. ప్రభుత్వ వైఫల్యాలు, ఓవర్‌యాక్షన్‌లు కప్పిపుచ్చుకోవడానికి, ఎవరినీ నోరెత్తకుండా చేయడానికి వివిధ చార్జీల రూపంలో ప్రజల నుంచే వసూలు చేస్తారు. ఎందుకంటే ఓట్లు వేసి మరీ అధికారం అప్పగించిన కూనలు కదా! వారు ఆ మాత్రం కష్టం కూడా భరించాలి అన్నది ప్రభుత్వ భావన. అదానీని కష్టపెట్టడం జగన్‌కి ఇష్టంలేకపోవచ్చు, వేరే రాష్టీయుడు కావడంతో. ఆ మాత్రం గౌరవం, ప్రేమా ప్రకటించాలి కదా. పైగా, జగన్‌కి అదానీ పట్ల అతి ప్రేమ ప్రకటించుకోవాల్సిన అవసరం బహుత్ హై. కారణం అదానీలు, ముఖేష్‌లు ప్రధాని మోడీగారి ఇష్టులు. పైగా గుజరాతీయులూను. మరి వారి పట్ల సోదర సాన్నిహిత్యం వుండనే వుంటుంది. ఈ రహస్యం ఇట్టే గమనించకపోలేదు ఏపీ ముఖ్యమంత్రి. ఏది ఏమయినా, ఇప్పడు తన స్వవిషయంలోగాని, రాష్ట్ర అవసరాలకోసమూ ప్రధాని ని సానుకూలం చేసుకోవడం అత్యంత అవసరం. అది జగన్ ఒక్కడివల్ల సాధ్యపడే సంగతి కాదు. ఇప్పుడీ బొగ్గు టెండర్లలో అదానీకి హెల్ప్ చేస్తే మనోడు ఢిల్లీలో పెద్దాయన చెవిలో పోనీద్దురూ ఆయనా మనోడే అని చెప్పి కాగలకార్యం కానిచ్చవచ్చని జగన్‌రెడ్డి మనసులో వుండవచ్చు. ఎంతయినా గుజరాతీయులు ప్రాంతీయాభిమానం వుండనే వుంటుంది. ఇటు జగన్ అవసరమూ పెద్దాయనకి ఉండకా పోలేదు. అన్ని విధాలా ఈ ఆలోచన, సమయం కలిసి వచ్చినయి అని ఏపీ ముఖ్యమంత్రి అనుకోనూ వచ్చు. ఎంతయినా బిజినెస్ మైండ్!అలా జగన్ అదానీకి మరింత దగ్గరకావడం అవసరం. ఇక్కడి జనాలు జగన్‌కి కేవలం ఓటర్లు. ఏదయినా సహిస్తారన్న ధీమా! ఇది భరించడం బహు కష్ట్ హై! అనుకోవడమే కాదు, ఇది ఎంతవరకూ సమంజస మని గొంతువిచ్చే వారికోసం ఎదురుచూడాలి.. చూద్దాం!.