పల్నాడు
రాష్ట్ర సరిహద్దు వద్ద టిడిపి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పొందుగల చెక్ పోస్టు వద్ద పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు జీ.వి ఆంజనేయులు,మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కొల్లు రవీంద్రలను ముందస్తు అరెస్ట్ చేసారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, దుర్గి మండలం జంగమహేశ్వరపురం గ్రామంలో టిడిపి నాయకుడు ఆవుల జంగయ్య ను వైసిపి గుండాలు దారికాచి మరి గుడ్డలతో అతి కిరాతకంగా హత్య చేశారు. టిడిపి నాయకుడు మృతదేహాన్ని సందర్శించేందుకు నరసరావుపేటకి వస్తున్న పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు,మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు,కొల్లు రవీంద్రలను రాష్ట్ర సరిహద్దు పొందుగల చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని ఒక ప్రైవేటు స్థలంలోకి తరలించి ముందస్తు అరెస్ట్ చేశారు. వైసిపి ప్రభుత్వ దుర్మార్గ పాలనను, పోలీసుల దౌర్జన్యం ఖండిస్తూ టిడిపి నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.