నర్సాపురం
రాష్ట్రం లో వైసిపి పార్టీ కాపులను అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని జిల్లా కాపు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు . ఇటీవల వైసిపి పార్టీ నుండి సస్పెండ్ కు గురయిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ను ఆయన స్వగృహం లో జిల్లా కాపు సంఘం నాయకులు కలసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా కాపు సంఘం నాయకులు ఆరేటి ప్రకాష్ మాట్లాడుతూ వైసిపి పార్టీలో కాపులకు ఒక న్యాయం ఇతర కులాలకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు .ప్రతి రోజు పార్టీని ముఖ్యమంత్రి ని విమర్శించే నరసాపురం ఎంపీ రఘురామ ను పార్టీ నుండి సస్పెండ్ చేయలేని నాయకులు పార్టీ కి నీతిగా నిజాయితీగా పనిచేసే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇమేజ్ దెబ్బతీసే విధంగా షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడం దారుణం అన్నారు ఇది కేవలం కాపులను రాష్ట్రం లో ఏకాకిని చేసే పనిలో భాగమ్ లో చర్యలు అన్నారు . అమలాపురం అల్లర్లు లో కూడా అమాయకులైన కాపులపై కేసులు బనాయించారని అన్నారు వైసిపి పార్టీ కి రానున్న రోజులలో కాపులు సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు