YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆసియాలో అంబానీ నెంబర్ వన్

ఆసియాలో అంబానీ నెంబర్ వన్

ముంబై, జూన్ 4,
ప్రపంచ కుబేరుల జాబితాలో అంబానీ ఓమొట్టు ముందుకు వెళ్లారు. రిలయన్స్ గ్రూపు షేరు విలువ రివ్వున దూసుకెళ్లడంతో ముఖేశ్ అంబానీ నికర సంపదలో పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో.. వరల్డ్ బిలియనీర్స్ జాబితాలో అంబానీ 8వ స్థానానికి ఎగబాకారు. ఈ క్రమంలో మరో భారత కుబేరుడు గౌతమ్ అదానీని వెనక్కి నెట్టారు అంబానీ. అంతేకాదు, ఆసియా సంపన్నుల జాబితాలో అగ్రస్థానాన్ని అంబానీ చేజిక్కించుకున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ సంస్థ బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. ఈ జాబితాలో అంబానీ 8వ స్థానంలో ఉండగా, అదానీ 9వ స్థానంలో నిలిచారు.ఎప్పట్లాగానే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 227.5 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే నెంబర్ వన్ కుబేరుడిగా కొనసాగుతున్నారు. అలాగే జెఫ్ బెజోస్- 149.4 బిలియన్ డాలర్లతో రెండవ స్థానంలో, బెర్నార్డ్ ఆర్నాల్ట్- 138.3 బిలియన్ డాలర్లు మూడవ స్థానంలో, బిల్ గేట్స్- 123.6 బిలియన్ డాలర్లతో నాల్గవ స్థానంలో, వారెన్ బఫెట్- 114.1 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో, లారీ పేజ్- 106.4 బిలియన్ డాలర్లతో ఆరో స్థానంలో, సెర్గీ బ్రిన్- 101.9 బిలియన్ డాలర్లతో ఏడో స్థానంలో, ముఖేశ్ అంబానీ- 99.7 బిలియన్ డాలర్లతో ఎనిమిదవ స్థానంలో, గౌతమ్ అదానీ- 98.7 బిలియన్ డాలర్లతో తొమ్మిదవ స్థానంలో ఉండగా.. స్టీవ్ బామర్- 96.8 బిలియన్ డాలర్లతో పదవస్థానంలో ఉన్నారు.

Related Posts