YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

ఐదు భాషల్లో వీరమహాదేవి

ఐదు భాషల్లో వీరమహాదేవి

స్టివ్స్ కార్నర్ పతాకంపై ఫోన్స్ స్టీఫెన్ నిర్మాతగా వి.సి.వడివుడయాన్ దర్శకత్వంలో సన్నీలియోన్ నటిస్తున్న భారీ చరిత్మాత్మక చిత్రం వీరమహాదేవి. 100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకేసారి 5 భాషల్లో షూటింగ్ జరుపుకొంటుంది. సన్నీలియోన్ తెలుగులో మొదటిసారి నటిస్తున్నందున ఆమె తెలుగు నేర్చుకొంటున్నారు. నాజర్ మరియు తమిళ్, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషలలోని ప్రముఖ నటులు ఇందులో నటిస్తున్నారు. యుద్ధ సన్నివేశాల కొరకు సుమారు 1000 గుర్రాలు, ఏనుగులు ఉన్నందున నటీనటులకు గుర్రపుస్వారీలో శిక్షణ ఇస్తున్నారు. సన్నీలియోన్ దుస్తులు దక్షిణభారత సంప్రదాయంలో ఉంటాయి . వీటిని ముంబై తో తయారు చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో భారీ సెట్ వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు . కేరళలోని అడవులలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో భారీ ఫైటింగ్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. పోర్న్‌స్టార్ నుంచి బాలీవుడ్ స్టార్‌గా ఎదిగిన స‌న్నీలియోన్‌కు ప్రపంచవ్యాప్తంగా సూప‌ర్ క్రేజ్ ఉందనడంలో సందేహం లేదు. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూనే ఇతర భాషల సినిమాల్లో కూడా అప్పుడప్పుడు మెరుస్తూ వెండితెరకు కొత్త అందం తెస్తోంది స‌న్నీలియోన్‌. ఇటీవలే రాజశేఖర్ హీరోగా వచ్చిన 'గరుడ వేగ' చిత్రంలో 'డియో.. డియో..' అంటూ కుర్రకారు గుండె వేగాన్ని పెంచేసిన ఈ సుందరి తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గ్రాఫిక్స్ ఎక్కువగా ఉన్నందున కెనడాలోని కంపెనీ మరియు ఇక్కడ ఒక ముఖ్య కంపెనీ కలసి పనిచేస్తున్నాయి. లార్డ్ ఆఫ్ ది కింగ్స్, గాడ్స్ ఆఫ్ ది ఈజిప్ట్ చిత్రాలకు పనిచేసిన వారు ఈ చిత్రానికి గ్రాఫిక్స్ పర్యవేక్షకులుగా పనిచేస్తున్నారు. గ్రాఫిక్స్ కోసం సుమారుగా 40 కోట్లు ఖర్చుపెడుతున్నారట. ఈ చిత్రం కోసం సన్నీలియోన్ 150 రోజులు కేటాయించారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ప్రపంచవ్యాప్తంగా  విడుదల చేశారు.

Related Posts