YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

వింత పెళ్లికి ఆదిలోనే ఆటంకం.

వింత పెళ్లికి ఆదిలోనే ఆటంకం.

గాంధీనగర్, జూన్ 4,
తనని తానే పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన ఓ యువతి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని వడోదరకు చెందిన క్షమా బిందు అనే 21 ఏళ్ల యువతి స్వీయ వివాహం చేసుకునేందు సిద్ధమైంది. ఈ వివాహం జూన్‌ 11న జరగనుందని ఏకంగా వివాహ ఆహ్వాన పత్రికలను కూడా ప్రింట్‌ తీయించుకుంది. తనకు పెళ్లి అంటే ఇష్టం లేదని, కానీ వధువు కావాలనే కోరిక ఉందని అందుకే పెళ్లి చేసుకోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపి సంచలనం సృష్టించింది. ఇదిలా ఉంటే ఈ స్వీయ వివాహానికి ఆదిలోనే ఆటంకం ఎదురైంది. క్షమాబిందు ఈ నెల 11న తన వివాహాన్ని గోత్రిలోని ఆలయంలో చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే తాజాగా ఆ ఆలయ యాజమాన్యం ఈ పెళ్లికి అనుమతి నిరాకరించింది. ఇలాంటి నిర్ణయాలు సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న కారణంతో వివాహానికి ఆలయ పాలకమండలి ఒప్పుకోలేదు. ఇదిలా ఉంటే ఈ స్వీయ వివాహంపై పలువురు సామాజిక కార్యకర్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటివి సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, సోలోగామి (స్వీయ వివాహం) అనేది ఎప్పటికీ చట్టపరంగా సరైంది కాదంటూ అడ్వకేట్‌లు కూడా వాదిస్తున్నారు. అయితే తన వివాహానికి ఆలయ యాజమాన్యం అడ్డుచెప్పినా తగ్గేది లేదని అంటోంది క్షమా బిందు. ఆ ఆలయంలో పెళ్లి చేసుకోబోనని తేల్చి చెప్పింది. మరి బిందు తన వివాహం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Posts