YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డోలాయామానంలో రెబల్ ఎమ్మెల్యేలు

డోలాయామానంలో రెబల్ ఎమ్మెల్యేలు

విజయవాడ, జూన్ 6,
టీడీపీ నాకు ఎన్నో చాన్సులిచ్చింది.. ఎదిగాను.. కానీ వైసీపీలో చేరాను అని ఘనంగా లేఖలో రాసుకున్న వాసుపల్లికి తగిన శాస్తి జరిగిందని టీడీపీ నేతలు శాపనార్ధాలు పెడుతున్నారు. వాసుపల్లి గణేష్‌ ఇక వైసీపీకి దూరమయినట్లే. ఆయనను ఎవరూ దగ్గరకు తీయరు. టీడీపీలోకి అసలు రానీయరు. జనసేనలో చాన్స్ ఉండొచ్చు. కానీ ఆయన రికార్డు చూసి పవన్ ఏమనుకుంటారో తెలియదు. వాసుపల్లి పనైపోయింది.. ఇప్పుడు అందరూ వైసీపీలో చేరిన మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి అన్న చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతోంది. గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీలో చేరిన ఎమ్మెల్యేల్లో ఒకరు వల్లభనేని వంశీ. ఆయనపై పేదలకు ఇచ్చిన ఓ స్థలం విషయంలో చిన్న కేసు నమోదు కాగానే వెళ్లి వైసీపీలో చేరిపోయారు. సైలెంట్ గా ఉంటే సరిపోయేది కానీ చంద్రబాబును.. లోకేష్‌ను.. భువనేశ్వరిని అత్యంత దారుణంగా తిట్టి.. ప్రజల్లో చులకన అయిపోయారు. ఈ తిట్లనే చూపించి వైసీపీ నేతలు కూడా వంశీ అసలు మనిషే కాదని.. టిక్కెట్ ఇస్తే పని చేయమని అంటున్నారు. వైసీపీ క్యాడర్ ఎవరూ ఆయనకు సపోర్ట్ చేయడం లేదు. పనులు జరుగుతాయన్న నమ్మకంతో ఆయన వెంట తిరుగుతున్న వారు మాత్రమే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది కూడా స్పష్టత లేదు. ఆయన వల్ల మైనస్ అవుతుందని అనుకుంటే పక్కన పెట్టేస్తారు. ఓ రకంగా వంశీ పూర్తిగా దెబ్బతిన్నట్లేనని చెబుతున్నారు. ప్రభుత్వం మారితే.. గన్నవరంలో ఆయన గెలిచినా నరకం చూపించడం ఖాయమన్న అభిప్రాయం టీడీపీలో గట్టిగా వినిపిస్తోంది. 21014 ఎన్నికల్లో గుంటూరు తూర్పు లో ముస్లింలకు ఇవ్వకుండా ఆర్యవైశ్యకు ఇవ్వాలని చంద్రబాబు ప్రయోగం చేశారు. మద్దాలి గిరి అనే నేతకు చాన్సిచ్చారు. గట్టి పోటీ ఇచ్చిన ఆయన ఓడిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఐదేళ్లు ఆయనే ఎమ్మెల్యే అన్నట్లుగా పెత్తనం చేశారు. ఆయన నమ్మకంగా ఉంటారని నమ్మిన చంద్రబాబు 2019లో కమ్మ లేదా కాపు సామాజికవర్గాలకు ఇవ్వాలని గుంటూరు పశ్చిమ స్థానాన్ని ఇచ్చారు. అన్ని చోట్లా ఓడిపోయినా ఆయన గెలిచారు. కానీ వెంటనే వైసీపీకి ఫిరాయించారు. తనకు ఉన్న కొన్ని పత్తి మిల్లుల బకాయిల కోసం చేరిపోయారు. ఇప్పుడు ఆయన వైసీపీలో ఉన్నాడా లేడా అన్నట్లుగా పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇచ్చేచాన్సే లేదని ఇప్పటికే చెప్పుకుంటున్నారు. అక్కడ అప్పిరెడ్డి కాచుకుని కూర్చున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన యేసురత్నం కూడా ఉన్నారు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. మద్దాలి గిరి ఇక ఎమ్మెల్యే అయ్యే యోగం కాదు కదా పోటీ చేసే అవకాశం కూడా రాదని వైసీపీ లోనే క్లారిటీ వచ్చేసింది. నాకేమైనా గ్రానైట్ బిజినెస్‌లు ఉన్నాయా ఏమిటి పార్టీ మారడానికి అని పెద్ద పెద్ద మాటలు చెప్పిన కరణం బలరాం… వైసీపీలో చేరిపోయారు. ఇందుకు ఆయన చెప్పిన కారణాలు చెప్పుకోవచ్చు కానీ.. ఇప్పుడు అక్కడ అమంచి సెగను ఎదుర్కొంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్న కుల వ్యతిరేకత ప్రకారం చూస్తే.. చివరికి కరణం బలరాంకు హ్యాండిచ్చి… ఆమంచికే చీరాల చాన్సిస్తారు. కుదిరితే పర్చూరులో పోటీ చేసుకోమని కరణం కుమారుడికి ఆయన చెప్పే అవకాశం ఉంది. లేకపోతే.. అద్దంకి వైపు పంపుంతారన్న చర్చ జరుగుతోంది. అదే జరిగితే.. కరణం .. ఆయన కుమారుడి రాజకీయ జీవితం అంతటితో ముగిసిపోయినట్లేనని చెబుతున్నారు..ఇక
వాసుపల్లి గణేష్ కుమార్ సమన్వయకర్త పదవి నుంచి తప్పుకుని అధికార వైసీపీకి షాక్ ఇచ్చారు. టీడీపీ నుంచి వచ్చిన తనకు వైసీపీలో విలువ లేకుండా పోతుందని వాసుపల్లి గత కొంతకాలంగా మదనపడుతున్నారు. ఇన్నాళ్లూ ఉత్తరాంధ్ర విజయసాయిరెడ్డి ఇన్ ఛార్జిగా ఉండటంతో పంటి బిగువున ఉన్నారు. ఇటీవల పార్టీ హైకమాండ్ ఇన్ ఛార్జిగా వైవీ సుబ్బారెడ్డిని నియమించింది. అప్పుడయినా తనకు ప్రాధాన్యత దక్కుతుందని వాసుపల్లి గణేష్ కుమార్ భావించారు. కానీ పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు లేదని గ్రహించిన ఆయన ఇన్ ఛార్జి పదవికి రాజీనామా చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ 2014, 2019లో టీడీపీీ నుంచి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. కొన్నాళ్ల క్రితం వైసీపీకి ఆయన మద్దతుదారుగా మారిపోయారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసి గెలవాలని ఆయన తొలుత భావించారు. అప్పటికే అక్కడ వైసీీపీ నేతలుగా ఉన్న ద్రోణంరాజు శ్రీవాత్సవ, రెహ్మాన్, మత్స్యకార కార్పొరేషన్ ఛైర్మన్ కోలా గురువులు వేర్వేరు వర్గాలుగా ఇక్కడ ఉండి వాసుపల్లిక తలనొప్పిగా మారారు. ఎందుకు ఈ పార్టీలోకి వచ్చానా? అని ఆయన తల పట్టుకోని రోజంటూ లేదు. దీనికి కారణం వైసీపీలో వాసుపల్లికి వ్యతిరేకంగా ఉన్న గ్రూపులను హైకమాండ్ ప్రోత్సహిస్తుండటమే. కార్పొరేషన్ ఎన్నికలు వాసుపల్లికి మరింత అసంతృప్తిని రేగేలా చేశాయి. వాసుపల్లి టిక్కెట్ నిరాకరించినా ఇండిపెండెంట్లుగా పోటీ చేసి విజయం సాధించిన కార్పొరేటర్లు నేడు ఆయనపై తిరగబడుతున్నారు. ఇవన్నీ అనేకసార్లు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. దీంతో ఆయన ఇన్ చార్జి పదవికి రాజీనామా చేశారు. ఇది ప్రారంభం మాత్రమే.

Related Posts