YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అనారోగ్యంతో ట్రిపుల్ ఐటీ విద్యార్ధి మృతి

అనారోగ్యంతో ట్రిపుల్ ఐటీ విద్యార్ధి మృతి

నూజివీడు
ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో అనారోగ్య కారణాలతో పి.యు.సి. రెండవ సంవత్సరం విద్యార్థి మృతి చెందాడు. ఆదివారం  అర్ధరాత్రి హాస్టల్ రూంలో నోటి వెంట నురగతో అపస్మారక స్థితిలో ఉన్న ఆర్.నితీష్ కుమార్ ని  తోటి విద్యార్థులు గమనించారు.  అతడికి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాధమిక చికిత్స అనంతరం విజయవాడకు తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ  విద్యార్థి నితీష్ కుమార్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతిచెందిన విద్యార్థి స్వగ్రామం నెల్లూరు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు

Related Posts