మచిలీపట్నం
కృష్ణా జిల్లా మచిలీపట్నం గరాలదిబ్బ గ్రామంలో టిడిపి వైసిపి నాయకులు మధ్య ఘర్షణ చేలరేగింది. టిడిపి నాయకులు, వైసిపి నాయకులపై దాడి చేసినట్లు సమాచారం. రెండు కుటుంబాల మధ్య ఘర్షణ నేపధ్యంలో గత అర్ధరాత్రి రాళ్లతో దాడి జరిగింది. విచక్షణ రహితంగా, ఆడవాళ్ళ చూడకుండా దాడులు చేసుకున్ఆరు. బందరు తాలుకా పోలీసులు తొమ్మిదిమంది తెలుగుదేశం నాయకులని అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో స్వల్ప గాయాలయివారిని మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆరుగురికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా వుంది. వారిని విజయవాడ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసారు.