YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సీమలో వానలు

సీమలో వానలు

తిరుపతి
రాయలసీమలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కడప, కర్నూలు జిల్లాలో సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. కర్నూలు జిల్లా ఆలూరులో భారీ వర్షం కురిసింది. దీంతో ఆలూరు సమీపంలో కల్లివంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు దాటుతుండగా ఓ కారు నీటి ప్రవాహంలో కొట్టుకు పోయింది. కారులో నలుగురు లేదా ఐదు మంది ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తు న్నారు. కారు గుంతకల్లు నుంచి ఆలూరు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన కారున పోలీసులు గ్రామస్తుల సాయంతో వెలికితీసారు. కల్లివంక వరద ప్రవాహం వల్ల ఆలూరు నుంచి గుంతకల్లు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కడప జిల్లాలోని పులివెందులలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ గాలుతో వర్షం దంచి కొట్టింది. వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా పిడుగుల గర్జించడంతో ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. చెట్లు కూలిపోయాయి. మామిడి పంట నేలరాలింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో తొలకరి జల్లులు పలకరిస్తుండడంతో అన్నదాత వ్యవసాయానికి సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Related Posts