కొవ్వూరు
ఆదివారం వరకు అధిక ఉష్ణోగ్రత లతో విలవిలలాడిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు సోమవారం ఉదయం నుండి ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, గాలులతోభారీ వర్షం రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకసారి గా వాతావరణం మారడంతో చల్లని గాలులతో వాతావరణం మారడంతో సేదతీరుతున్నారు. భారీ వర్షాల నేపధ్యంలో జనజీవనం ఎక్కడికక్కడే స్తంభించింది. గాలివాన నేపథ్యంలో కరెంట్ కోతతో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు ఆగిపోయాయి