YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల

అమరావతి జూన్ 6,  ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణత 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాసు కాలేదు ప్రకాశం జిల్లా ఫస్ట్.. అనంతపురం జిల్లాలో లాస్ట్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ :
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6 లక్షల 15 వేల 980 మంది విద్యార్థులు హాజరు కాగా 4లక్షల 14,281 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 3 లక్షల16,820 మంది పరీక్షలు రాయగా 2 లక్షల 2081 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు రెండు లక్షల 99వేల 85 మంది పరీక్షలు రాయగా రెండు లక్షల 11వేల 460 మంది పాసయ్యారు.ఈసారి కూడా బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణత సాధించారు.797 పాఠశాలలో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారని వివరించారు. 71 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాసు కాలేదని బొత్స వెల్లడించారు. రాష్ట్రంలోని 23 జిల్లాలో ప్రకాశం జిల్లాలో అత్యధిక సంఖ్యలో 78.30శాతం మంది విద్యార్థులు పాసయ్యారని ఆయన వివరించారు. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. పక్కనున్న నాలుగు రాష్ట్రాల్లో కంటే ముందుగా పది పరీక్షల ఫలితాలను విడుదల చేయడం రికార్డు అని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫేయిల్‌ అయిన విద్యార్థుల కోసం జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. వచ్చేనెల 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఫేయిల్ అయిన విద్యార్థుల కోసం ఈ నెల 13 నుంచి పరీక్షల వరకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమతమ పిల్లలను శిక్షణా తరగతులకు పంపించాలని కోరారు.

Related Posts