YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

దేశంలో అంతకంతకూ పెరిగిపోతోన్న ఊబకాయుల సంఖ్య

దేశంలో అంతకంతకూ పెరిగిపోతోన్న ఊబకాయుల సంఖ్య

దేశంలో అంతకంతకూ పెరిగిపోతోన్న ఊబకాయుల సంఖ్య 15-49 ఏళ్ల వయస్సు గల స్త్రీలు 15-54 వయస్సున్న పురుషులపై సర్వే పట్టణ ప్రాంతాల్లో 33 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ, కర్ణాటక, గోవా, కేరళ, వంటి రాష్ట్రాల్లో మూడోవంతు ఐదేళ్లలోపు చిన్నారుల్లో 3.4 శాతం పిల్లలు అధిక బరువు తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 నివేదిక లో వెల్లడి
సులువుగా అందుబాటులో ఉన్న ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్లతోపాటు ప్రజల జీవనశైలిలో వస్తున్న మార్పులతో దేశంలో ఊబకాయుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ మేరకు తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే -5 నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా పట్టణాలు నగరాల్లోని ప్రజల్లో ఎక్కువ మంది లావై పోతున్నారని పేర్కొంది.పురుషులే కాకుండా మహిళలు ఊబకాయులుగా మారుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే బాంబుపేల్చింది. అధిక బరువు పెరిగితే ఆయుష్షు తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నా ప్రజలు మారడం లేదు. ఒక వ్యక్తి ఉండాల్సిన సాధారణ బరువు కంటే 10 కిలోలు అదనంగా ఉంటే.. మూడేళ్ల జీవితం క్షీణిస్తుందని నిపుణులు చెబుతుండటం అందరిలోనూ ఆందోళన పెంచుతోంది.ప్రపంచ వ్యాప్తంగా ఊబకాయులు అధికంగా ఉన్న మొదటి ఐదు దేశాల్లో మనదేశం కూడా ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ఓ సర్వే ప్రకారం.. దేశంలో 1.35 కోట్ల మంది ఊబకాయులు (అధిక బరువుతో బాధపడేవారు) ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం ఆ సంఖ్య చాలా ఎక్కువగా పెరుగుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తాజాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే కూడా ఇదే విషయాన్ని పేర్కొంది.జాతీయ కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ... దేశవ్యాప్తంగా 15-49 ఏళ్ల వయస్సు గల స్త్రీలు 15-54 వయస్సున్న పురుషులపై సర్వే చేసింది. ఇందులో అధిక బరువుతో బాధపడుతున్నవారి సంఖ్య పట్టణ ప్రాంతాల్లో 33 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 20 శాతంగా ఉంది.గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ కర్ణాటక గోవా కేరళ వంటి రాష్ట్రాల్లో దాదాపు మూడోవంతు మంది అధిక బరువుతో ఉన్నారు. అంతేకాకుండా ఐదేళ్లలోపు చిన్నారుల్లో 3.4 శాతం పిల్లలు అధిక బరువు కలిగి ఉన్నారని సర్వే తేల్చింది.బాడీ మాస్ ఇండెక్సు (బీఎంఐ) ఆధారంగా మనుషుల్లో బరువును అంచనా వేస్తారు. దీని ప్రకారం బీఎంఐ 25 శాతం లేదా అంత కంటే ఎక్కువ ఉంటే ఊబకాయంగా నిర్ధారిస్తారు. తాజా సర్వేలో పురుషుల స్త్రీల సగటు బీఎంఐ రేటు సమానంగా 22.4 శాతం ఉంది. మహిళల్లో 15-49 ఏళ్ల మధ్య వయసు వారిలో 5 శాతం 40-49 ఏళ్ల మధ్య వారిలో 37
శాతం ఊబకాయులు ఉన్నారు. పురుషుల్లో 15-19 ఏళ్ల మధ్యలో 7 శాతం ఊబకాయులు ఉండటగా 40-49 ఏళ్లవారిలో ఇది ఏకంగా 32 శాతంగా ఉండటం ఆందోళన పెంచుతోంది.

Related Posts