YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పీచేమూడ్ లో కాషాయ నేతలు

పీచేమూడ్ లో కాషాయ నేతలు

తిరుపతి, జూన్ 7,
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు తిరుపతి లోక్‌సభ సీటు గెలిచిన బీజేపీ.. ప్రస్తుతం ఉందా లేదా అన్నట్టుగా మారిపోయింది. జిల్లాలో గుర్తింపు పొందిన కమలనాథులు ఏమైపోయారో అని కేడర్‌ ప్రశ్నించుకుంటున్న పరిస్థితి ఉంది. బాదుడే బాదుడు పేరుతో టీడీపీ నియోజకవర్గాలను చుట్టేస్తోంది. జనసేన కూడా ఏదో ఒక నిరసనతో జనాల్లో ఉండేందుకు చూస్తోంది. అధికారపార్టీ వైసీపీ గడప గడపకు మన ప్రభుత్వం అని ఊరూరా తిరుగుతోంది. ఈ రాజకీయ సందడిలో కనిపించంది బీజేపీ నేతలేనని లోకల్‌గా చెవులు కొరుక్కుంటున్నారు.ఎప్పుడు ఎన్నికలొచ్చినా.. గెలుపుమాదే అని గంభీరమైన ప్రకటనలు చేసే చిత్తూరు జిల్లా బీజేపీ నేతలకు ఏమైంది అని ఆరా తీస్తున్నారట. సొంత కేడరే మావాళ్లు ఎక్కడా అని వాకబు చేస్తున్నారట. ఆ మధ్య తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో బీజేపీ అగ్రనేతలు వరసపెట్టి వచ్చారు. ప్రచారం ఊదరగొట్టారు. ఆ ఎన్నిక కాగానే కమలనాథులు ఎక్కడివారు అక్కడే గప్‌చుప్‌. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్లు ఎన్నికలు కాగానే ఎలాగూ వెళ్లిపోతారు. కానీ.. లోకల్‌ బీజేపీ నేతలు కూడా కనిపించకుండా పోయారన్నది చర్చ.2019 ఎన్నికల్లో జిల్లాలో బీజేపీకి నామ మాత్రంగానే ఓట్లు వచ్చాయి. పెద్దగా పోటీ ఇచ్చింది కూడా లేదు. ఒక్క శ్రీకాళహస్తిలోనే ఎమ్మెల్యే అభ్యర్థి ఒక్కరే కాస్త హడావిడి చేశారు. గౌరవప్రదమైన ఓట్లు కూడా బీజేపీ అభ్యర్థులకు రాలేదు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదన్నది స్థానికంగా వినిపించే మాట. మధ్యలో తిరుపతి ఎంపీ ఉపఎన్నిక జరిగినా ఆ వేడిని కొనసాగించలేకపోయారు. పైగా జిల్లా బీజేపీ నేతల పనితీరుపై రాష్ట్ర నాయకులు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండటంతో బీజేపీ నేతలు ఇక్కడ క్రియాశీలకంగా ఉండేందుకు చూస్తుంటారు. కానీ.. జిల్లా బీజేపీలో ఉన్న అంతర్గత విభేదాలతో పార్టీ ఎదిగే పరిస్థితి కనిపించడం లేదని కాషాయ శిబిరంలోనే చెవులు కొరుక్కుంటున్నారు. పైగా కేడర్‌ కంటే లీడర్లే ఎక్కువనే సెటైర్లు పేలుతుంటాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రెండు నెలలకో.. మూడు నెలలకో తిరుపతి వస్తే జిల్లా నేతల అంతా ప్రత్యక్షం అవుతారు. వీర్రాజు వెళ్లిపోగానే అప్పటి వరకు హడావిడి చేసిన నాయకులు ఏమైపోతున్నారో కేడర్‌కే అర్థంకాదట. బీజేపీ, జనసేన మిత్రపక్షాలుగా ఉన్న కలిసి కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి లేదు. జిల్లాలోని 14 నియోజకవర్గాలకు అభ్యర్థులను సిద్ధం చేస్తున్నారో లేదో కూడా తమకే తెలియదని అంటున్నాయి శ్రేణులు. మరి.. క్షేత్రస్థాయిలోని ఈ ప్రతికూల పరిస్థితులను బీజేపీ పెద్దలు ఎలా అదిగమిస్తారో చూడాలి.

Related Posts