కాకినాడ, జూన్ 7,
ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో ఏం చేయాలో పోలీసులకూ తెలియడం లేదు. మామూలుగా ఓ ఎమ్మెల్సీ మర్డర్ చేసినట్లుగా అంగీకరిస్తే పోలీసులు ఎంత హ డావుడి చేస్తారు. అలా అరెస్ట్ చేయగానే ఇలా కస్టడీ పిటిషన్ వేశారు. కస్టడీలోకి మూడు రోజులో.. నాలుగు ోజులో తీసుకుంటారు. ప్రతీ రోజూ విచారణలో ఫలానా విషయం చెప్పారంటూ పోలీసులు మసాలా దట్టించి మరీ మీడియాకు లీక్ చేస్తారు. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ విషయంలో ఆయనేం చెప్పారో అదే రాసుకున్న పోలీసులు .. కనీసం కస్టడీకి కూడా తీసుకోవడం లేదు. రిమాండ్ ముగియడంతో ఆయనను కోర్టులో హాజరు పరిచారు. అయితే పోలీసులు ఏమీ చెప్పకపోతే బెయిలిచ్చేస్తారు. కానీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. దీంతో తప్ప ని సరి అన్నట్లుగా రిమాండ్‌ను పొడిగించాలనే పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రిమాండ్ పొడిగించారు. మంగళవారం ఆయన బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుంది. బెయిలిస్తారో లేదో తర్వాత విషయం.. కానీ కేసు నమోదు మాత్రం ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య కాదన్నట్లుగా ఉంది. ఉద్దేశపూర్వకంగానే చేశారని.. నిరూపించాడనికి పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. మీడియానే పోలీసులు చెప్పిన “స్టోరీ” కరెక్టా కాదా అన్న దర్యాప్తు చేసింది. అంతా తప్పేనని తేలింది. అయినా పోలీసులు ఏ మాత్రం ఫీల్ కాకుండా ఇతర దర్యాప్తు విషయంలో.. నెమ్మదిగా ఉంటున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని టీడీపీ నేతల్ని రోజుల తరబడి విచారణ జరుపుతూండటం.. ఇక్కడ కొసమెరుపు. అందుకే పోలీసుల వ్యవహారశైలి.. వారు అమలు చేస్తున్న చట్టంపై అనేక విమర్శలు తరచూ వస్తున్నాయి