YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భారత్ కు తలనొప్పిగా మారిన కామెంట్స్

భారత్ కు తలనొప్పిగా మారిన కామెంట్స్

ముంబై, జూన్ 7,
ఒక్క మాట.. ఒకే ఒక్క మాట .. భారత్‌కు అంతర్జాతీయంగా చెడ్డ పేరు తెస్తోంది. లోకల్‌గా జనం మధ్య చిచ్చు పెట్టి ఓట్ల పంట పండించుకోవడానికి గతంలో చాలా సార్లు అలాంటి మాటలు మాట్లాడి ఉంటారు కానీ.. ఈ సారి అది అంతర్జాతీయ అంశం అయిపోయింది. పలు దేశాలు తమ ప్రవక్తను అవమానించారని ఆరోపిస్తూ.. మేడిన్ ఇండియా అని కనిపిస్తే అమ్మకాలను బ్యాన్ చేస్తున్నాయి. ఖతర్ దేశంలో పెద్ద ఎత్తున ఉత్పత్తులను సూపర్ మార్కెట్ల నుంచి తొలగించి పక్కన పడేశారు. ఇతర దేశాల్లోనూ అదే పరిస్థితి ఉంది. నుపుర్ శర్మ , నవీన్ కుమార్ అనే ఇద్దరు నోరు చేసుకునే బీజేపీ నేతల వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వారు ఆ మాటలన్న తర్వాత చాలా మంది సమర్ధిస్తూ ట్వీట్లు పెట్టారు. ఈ వ్యవహారంలో బీజేపీ ఊహించని విధంగా విదేశాల నుంచి రియాక్షన్ వచ్చింది. దీంతో తప్పు దిద్దుకునేందుకు అన్నట్లుగా వెంటనే వారిద్దరినీ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ ఆహిష్కరణను ఎవరూ నమ్మడం లేదు. అంతర్గతంగా చేయాల్సిన రాజకీయాలను అంతర్జాతీయం చేసి ఇప్పుడు మేడిన్ ఇండియా ఉత్పత్తులపై ప్రభావం పడే స్థాయికి తీసుకు వచ్చారు. ఆ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేసి.. చమురును భారత్‌కు దిగుమతి చేయడం నిలిపివేస్తే ఇండియాలో చమురు సంక్షోభం ఏర్పడుతుంది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో తాము అన్ని మతాలను గౌరవిస్తామని చెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై బీజేపీ వేటు వేసింది. ఆరేళ్ళపాటు ఆమెను పార్టీ నుంచి బహష్కరిస్తూ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆమెలాగే ట్విటర్ మాధ్యమంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో నవీన్ కుమార్ జిందాల్‌ని కూడా సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. బీజేపీ ఈ చర్యలకు పూనుకుంది. ఓ టీవీ డిబేట్‌లో నుపుర్ శర్మ మాట్లాడుతూ.. ఓ వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసింది. దీంతో, ఆ మత వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. వాళ్ళు స్థానిక మార్కెట్‌ను మూసివేసేందుకు ప్రయత్నించగా, మరో వర్గం వారిని అడ్డుకుంది. తద్వారా ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో 40 మంది పౌరులతో పాటు 20 మంది పోలీసులు గాయపడ్డారు. బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు ఆ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ అల్లర్లు జరిగాయంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని బీజేపీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన అనంతరం ఆ ఇద్దరిని పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు వెల్లడించింది.సుదీర్ఘ చరిత్ర కలిగిన భారతదేశంలో ప్రతి మతమూ వర్ధిల్లుతోంది. అన్ని మతాల్ని బీజేపీ ఎప్పటికీ గౌరవిస్తుంది. మతపరమైన వ్యక్తుల్ని ఎవరైనా కించపరిస్తే, బీజేపీ సహించదు. అలాంటి వ్యక్తుల్ని పార్టీ ఎన్నటికీ ప్రోత్సహించదు’’ అని బీజేపీ ఆ ప్రకటనలో పేర్కొంది. భారతీయ పౌరులు ఏ మతాన్నైనా ఆచరించే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని, దేశ సమైక్యతను, సమగ్రతను కాపాడ్డానికి తాము కట్టుబడి ఉంటామని బీజేపీ తెలిపింది. అటు.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకుంటున్నానని, శివుడిని కించపరిచే విధంగా పదే పదే వ్యాఖ్యలు చేస్తున్నందుకే ప్రతిస్పందనగా ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని నుపుర్ శర్మ వివరణ ఇచ్చింది.ఎంత వరకూ బీజేపీ ప్రభుత్వ మాటల్ని ఆయా దేశాలు వింటాయో చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఆయా దేశాలకు ఎగుమతులపై కీలక ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.

Related Posts