తిరుపతి
తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం వడ్డి పాలెం దారుణం జరిగింది. భార్య ధనమ్మ(55)ను భర్త రమణయ్య కిరాతకంగా హత్య చేసాడు. 15 సంవత్సరాల క్రితమే విడాకులు తీసుకుని విడిగా జీవిస్తున్న ధనమ్మ,రమణయ్య లు 2 నెలల క్రితం మళ్ళీ కలిసి ఒకటిగా ఉంటూ నెల క్రితం మళ్ళీ గొడవలు పడి విడిగా జీవిస్తున్నారు. ధనమ్మ,రమణయ్య కు ముగ్గురు పిల్లలు,అదే గ్రామం లో ఒక కొడుకు తో కలిసి జీవిస్తున్న దనమ్మ ను రమణయ్య మంగళవారం తెల్లవారు జామున ఇనుప రాడ్డు తో తల పగలగొట్టి అతి కిరతంగా చంపినట్టు సమాచారం. నిందితుడు పరారీలో వున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.