YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆర్ ఆర్ ఆర్ డైరక్ట్ ఎటాక్

ఆర్ ఆర్ ఆర్ డైరక్ట్ ఎటాక్

విజయవాడ, జూన్ 8,
నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు తనను పార్టీ నుంచి బహిష్కరించాలని కోరుకుంటున్నారు. అందుకే ఆయన గతంలో మాదిరిగా కాకుండా నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకూ రఘురామ కృష్ణరాజు సొంత నియోజకవర్గానికి రావాలనుకుంటున్నారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత ఆయన నియోజకవర్గానికి రావాలని భావిస్తున్నారు. 4వ తేదీన భీమవరానికి ప్రధాని మోదీ వస్తుండటంతో రఘురామ కృష్ణరాజు కూడా ఈ పర్యటనలో పాల్గొనాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను... ఈలోపే తనను పార్టీ నుంచి బహిష్కరించాలని, లేదా సస్పెండ్ చేయాలని ఆయన కోరుకుంటున్నట్లు కనపడుతుంది. అందుకే ఇటీవల కాలంలో మరింతగా రెచ్చి పోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంతో పోలిస్తే అదనంగా ఖర్చు చేసిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. మూడేళ్లలో ఐదు లక్షల కోట్ల అప్పులను ప్రభుత్వం చేసిందని, సంక్షేమ పథకాల కోసం వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు, గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాల కోసం చేసిన ఖర్చును బయటపెట్టారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకం కూడా హంబక్ అని ఆయన పేర్కొన్నారు. కాపునేస్తం పథకాన్ని కూడా నిర్వీర్యం చేశారన్నారు జగన్ ను సయితం... అప్పులు చేసిన ఐదులక్షల కోట్లు ఏం చేశారని ఘురామ కృష్ణంరాజు నిలదీశారు. బీసీ మహిళ, తెలుగుదేశం నేత గౌతు శిరీష ను సీఐడీ ప్రశ్నించడం అమానవీయమని ఆయన తెలిపారు. ఒక బీసీ మహిళను గౌరవించే పద్ధతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడానికి ఎవరు కారణమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రా? సంబంధిత శాఖ మంత్రా? అని ఘురామ కృష్ణంరాజు నిలదీశారు. ఉత్తీర్ణత శాతం పడగొట్టడం ఒక్క జగన్ కే చెల్లిందని ఆయన పర్కొన్నారు. రుషి కొండ లో తవ్వకాలపైకూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామ కృష్ణంరాజు పిటీషన్ వేశారు. కొత్తపల్లి మాదిరిగానే.... గతంలో జగన్ ను రఘురామ కృష్ణంరాజు నేరుగా విమర్శిచే వారు కాదు. తాను వైసీీపీ ఎంపీనేనంటూ పరోక్ష విమర్శలు చేసేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంపైన, జగన్ పైనా నేరుగా విమర్శలు చేస్తున్నారు. ఇటీవల తమ ప్రాంతానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఆయనను సస్పెండ్ చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం సిఫార్సు మేరకు వైసీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది. తననను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని రఘురామ కృష్ణంరాజు కోరుకుంటున్నారు. ఆయన రాజీనామా చేస్తానని ఫిబ్రవరిలోనే చెప్పారు. కానీ చేయకుండా ఉండిపోయారు. ఈ రెండేళ్లు ఎంపీగా కొనసాగాలంటే వైసీపీ తననను బహిష్కరిస్తే మేలని ఆయన భావిస్తున్నట్లుంది. అందుకే జగన్ పైన, ప్రభుత్వంపైన నేరుగా విమర్శలకు దిగుతున్నారు. మరి వైసీపీ హైకమాండ్ రఘురామ కృష్ణంరాజుపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్నది చూడాలి.

Related Posts