YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సత్యేంద్ర జైన్ ఇంట్లో నోట్ల కట్టలు

సత్యేంద్ర జైన్ ఇంట్లో నోట్ల కట్టలు

న్యూఢిల్లీ, జూన్ 8,
హవాలా కేసులో అరెస్టయిన ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా, సత్యేంద్ర జైన్ ఇళ్లు, కార్యాలయాలతోపాటు.. ఆయనతో సన్నిహితంతగా ఉండే వారిపై దాడులు కొనసాగుతున్నాయి.  ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు చెందిన అత్యంత సన్నిహితుల నివాసాలపై ఈడీ దాడులు చేసింది. ఈ దాడిలో 2 కోట్ల 82 లక్షల నగదు, కిలో బంగారాన్ని దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. సత్యేంద్ర జైన్ సన్నిహితుల లొకేషన్ల నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ 133 బంగారు నాణేలను స్వాధీనం చేసుకుంది. హవాలా లావాదేవీల కేసులో సత్యేంద్ర జైన్ అరెస్టయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సత్యేంద్ర జైన్ ED కస్టడీలో ఉన్నారు.అరెస్టయిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ సహాయకుడిపై నుంచి 2.82 కోట్ల నగదు, కేజీ 800 గ్రాముల 133 బంగారు నాణేలు లభ్యమైనట్లు ఈడీ అధికారులు తెలిపారు. అతని సన్నిహితుడి దాచిన ప్రదేశం నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.కాగా.. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో.. ఈడీ అధికారులు మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015 – 16 సమయంలో హవాలా నెట్‌వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు, షెల్‌ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించిందిఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్‌ జైన్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. ఆయన్ను అరెస్టు చేసి పలు చోట్ల దాడులను నిర్వహిస్తోంది. కాగా.. జైన్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా జూన్‌ 9వ వరకు న్యాయస్థానం ఈడీ కస్టడీకి అనుమతించింది.

Related Posts