శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం కె గోపాలపురం గ్రామంలో తల్లిని చంపిన కుమారుడు సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి బోస్ భాగ్యవతి రామారావు అని వృద్ధ దంపతులు గోపాలపురం గ్రామంలో నివాసముంటున్నారు. కుమారుడు శ్రీనివాస్ రావు పాతపట్నం లో ఉంటున్నాడు మంగళవారం రాత్రి తల్లిదండ్రుల వద్దకు వచ్చిన శ్రీనివాసరావు ఎవరు లేని సమయంలో తల్లిదండ్రులపై రాత్రి సమయంలో దాడి చేశాడు. కత్తితో తల్లిదండ్రుల పై గాయపరిచాడు. తల్లి కి తీవ్ర గాయాలు కావడంతో ఇంట్లోనే మృతి చెందింది. వేకువ జామున శ్రీనివాసరావు గ్రామంలో పలువురు కి ఫోన్ చేసి తల్లిదండ్రులు గాయపరిచి నట్లు తెలియజేశాడు. పలువురు ఇంట్లో కి వెళ్లి చూడగా అప్పటికే భాగ్యలక్ష్మి మృతి చెందింది. గాయపడిన రామారావును గ్రామస్తులు సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. జరిగిన సంఘటనపై సీఐ వినోద్ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేస్తున్నారు.