॥ సర్వేజనాః సుఖినో భవంతు ॥
సంక్రాంతి పండుగ 14న జరుపుకోవాలా ? 15 న జరుపుకోవాలా ? అని చాలామందికి సందేహం ఉత్పన్నమవుతున్నది.దానికి కారణం సాంఘీక మాధ్యమాలలో, పలు వార్తా పత్రికలలో వచ్చిన వార్తల సారాంశం.కానీ సంక్రాంతి పండుగ విషయం లో అపోహలు వద్దని శక్తి పీఠం వ్యవస్థాపకులు స్వామి శాంతానంద పురోహిత్ చెప్పారు
సూర్యుడు ఏ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. సూర్యుడు తేది: 14 - 01 - 2018, ఆదివారము రోజు మధ్యాహ్నము 01:46 ని॥ లకు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కావున అదే రోజు అనగా తేది : 14 - 01 - 2018 నాడే మకర సంక్రాతి పండుగను ఆచరించాలన్నారు ,
తేది :13-01-2018, శనివారము : భోగి
తేది:14-01-2018, ఆదివారము : మకర సంక్రాంతి
తేది:15-01-2018, సోమవారము:కనుమ ( కరి ) జరుపుకోవాలని స్వామిజీ స్పష్టం చేశారు