కడప
యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్పీ, బీబీఎం డిగ్రీ కోర్సులు ఇయర్ ప్యాటర్న్ చదివిన విద్యార్థులకు (వన్టైంఆపర్చునిటీ) జూన్ 17వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు విశ్వవి ద్యాలయ పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ ఎన్. ఈశ్వర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ మొదటి, చివరి సంవత్సరం వారికి 17 నుంచి, ద్వితీయ సంవత్సరం వారికి 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని చెప్పారు.విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మునగల సూర్యకళావతి సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అభ్యర్థులు అన్ని పరీక్షలు యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎ. పి. జె అబ్దుల్ కలాం గ్రంథాలయ భవనంలో జరుగు తాయని తెలిపారు. హాల్ టికెట్లు సంబంధిత కళాశాలల నుంచి పొందాలని తెలిపారు. ఆలానే కొంతమంది ఆన్లైన్లో దరఖాస్తు చేసేక్రమంలో ఫొటో , సంతకం సమర్పించనివారు ఫొటోతోకూడిన ఐడెంటిఫికేషన్ సర్టిఫికెట్ తీసుకువచ్చి పరీక్షా కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ కు అందజేయాలని సూచించారు. చదివిన కళాశాలల్లో అలాగే వైవీయూ వెబ్సైట్ లో పరీక్షల టైం టేబిల్ అందుబాటులో ఉందన్నారు.