కడప
పులివెందులలో ఏపీ సీఎం జగన్ ఇంటిని సీబీఐ అధికారులు బుధవారం పరిశీలించారు. అక్కడ కొలతలు తీసుకున్నారు. సీఎం జగన్తో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి నివాస ప్రాంతాలను కూడా సీబీఐ అధికారులు పరిశీలించారు. సర్వేయర్లతో కొలతలు తీయించారు. జగన్ బాబాయి వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు హఠాత్తుగా సీఎం జగన్ ఇంటిని పరిశీలించడం ఆసక్తికరంగా మారింది.