YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఈడీ విచారణకు హాజరుకానీ సోనియా

ఈడీ విచారణకు హాజరుకానీ  సోనియా

న్యూఢిల్లీ, జూన్ 8,
నేషనల్ హెరాల్డ్” కేసు విచారణ వేగంగా సాగడం లేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కరోనా చికిత్స కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణ కు సోనియా గాంధీ హాజరుకాలేకపోయారు. వైద్యులు అనుమతిస్తేనే ఈడీ విచారణకు సోనియా గాంధీ హాజరవుతారు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించి విచారణకు హాజరవ్వాలని సోనియా గాంధీకి నోటీసులు ఇచ్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నియా గాంధీకి కరోనా సోకడంతో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ రోజు కాకుండా, విచారణకు ఈ.డి ని కొత్తగా వేరే తేదీ నివ్వాలని కోరినట్లు పార్టీ వర్గాల సమాచారం. జూన్ 2 వ తేదీన 75 ఏళ్ల సానియా గాంధీ కి “కరోనా” పాజిటివ్ గా నిర్ధారణ అయింది. జూన్ 13 వ తేదీన ఈ.డి విచారణకు హాజరతున్నారు రాహుల్ గాంధీ. కక్ష సాధింపు, రాజకీయ వేధింపుల్లో భాగంగానే ఈడీ నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది.అప్పుడప్పుడు “నేషనల్ హెరాల్డ్” కేసు ను లక్ష్యంగా చేసుకుని, నెహ్రూ-గాంధీ కుటుంబాన్ని వేధించేందుకు ఈ.డి లాంటి దర్యాప్తు సంస్ధలను మోడి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు. 1942 లో “నేషనల్ హెరాల్డ్” పత్రిక ప్రారంభమైంది. డబ్బు అన్నదే లేకుండా “మనీ లాండరింగ్” జరిగినట్లు ఆరోపణలేమిటని ప్రశ్నిస్తోంది కాంగ్రెస్. “మనీ లాండరింగ్” జరిగినట్లు సాక్ష్యాలు లేవని వాదిస్తున్నారు కాంగ్రెస్‌ నేత అభిషేక్ మను సింఘ్వి.

Related Posts