శ్రీకాకుళం,జూన్ 9,
పోటీకి దిగాలనుకోవడం గట్టి నిర్ణయంతోనే జరుగుతుంది. పోటీ పడుతున్నామంటేనే గెలుపు ధీమా రెట్టింపు వుంటుంది, వుండాలి. పోటీలో ఎదుటి వ్యక్తి సత్తాని, సామర్ధ్యాన్ని అనుసరించి గట్టి పోటీదారుడిని రంగంలోకి దింపాలి. ఇదంతా మామూలే. ప్రాంతం, అక్కడి రాజకీయ వాతావరణం, విపక్ష అభ్యర్ధి గురించి తెలిసిన వారినీ దింపాలి. అదేదో సామెత చెప్పినట్టు అభ్యర్ధినే గట్టిగా నిర్ణయించకపోతే వున్నంత మందీ తామే అసలు అభ్యర్ధి అనుకుంటూ నడుం బిగించి ప్రచారానికి దిగితే? పెనుముప్పే! పార్టీ అధినేత నిర్ణ యించాల్సిన అభ్యర్ధి ఎవరనేది తేలకపోతే, తనకు తానే అనుకునేవారి సంఖ్య పెరిగితే ఆ ప్రాంతంలోని పార్టీ అభిమానులు, వీర అనుచరులు మరి ఎవరికి మద్దతుగా ప్రచారం చేసుకోవాలి. నేనంటే నేను అంటూ వున్నంతమంది రోడ్డుమీదకి వస్తే కామెడీ అవుతుంది తప్ప సీరియస్ ప్రచారం, గెలుపు గుర్రంగా నిలవడ మూ కష్టమే అవుతుంది! చిత్రమయిన పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లోని టెక్కలి విషయంలో ఏర్పడింది. టెక్కలిలో కింజా రపు అచ్చెంనాయుడు తిరుగులేని టిడిపీ నేత. అక్కడ ఆయన 2014, 2019ల్లో మంచి మెజారిటీతోనే గెలి చారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే అవకాశం వుందన్నది అక్కడ బాగా ప్రచారంలో వున్నమాట.ఆయన్ను ఓడించాలని వైసిపి తీవ్రంగా ప్రయత్నిస్తోంది అధికార వైసీపీ. గతంలో రెండు పర్యాయాలు దెబ్బతిన్న సంగతి పక్కనబెట్టి ఈ పర్యాయం మాత్రం ఆయన్ను గట్టిగానే ఢీకొనాలని అనుకుంటోంది. కానీ అందుకు తగ్గ అభ్యర్ధి నిర్ణయం విషయంలో ఇప్పటికీ సందిగ్ధంగానే వున్నారు వైసీపీ అధినేత. ఎన్నికలకు ఇంకా సమయం వున్నప్పటికీ ఇప్పటికే ఎవరినో ఒకరిని అనుకుంటే పాపం వారు ప్రచారంలో కాలం గడుపుతుంటారు, విజయం సంగతి ఆనక తేల్చుకోవచ్చుగదా! మంచి మాటే. కానీ టెక్కలి విషయంలో వైసీపీ తరఫున టికెట్ ఆశావహులు ఏకంగా ముగ్గురు తయారయ్యా రు. . దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, కిల్లి కృపారాణి! వీరిలో దువ్వాడ, పేరాడ గతంలో అచ్చెం నాయుడు చేతిలో ఓడినవారే. కిల్లి కృపారాణి కాంగ్రెస్‌తో విసిగెత్తి వైసీపీలోకి వచ్చారు. ముగ్గురికీ టెక్క లిలో మంచి ఫాలోయింగ్ వుంది. వీరు ముగ్గురూ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు, ప్రచారానికి సన్నద్ధమవుతు న్నారు. ఇక్కడ మెలికేమంటే, దువ్వాడ కంటే తిలక్ మీద వైసీపీ అధినేతకు కాస్తంత ప్రేమ ఎక్కువట.అందువల్ల దువ్వాడకు ఎమ్మెల్సీ చాన్స్ ఇచ్చారని ప్రచారం వుంది. పైగా ఈ దువ్వాడ సామాన్యుడు కాదు. ఈయనకి దూకుడు ఎక్కువే. వీలయినపుడల్లా అచ్చెం నాయుడి మీదకి ఒంటికాలిమీద లేవడం అల వాటు చేసుకున్నారు. ఈమధ్య మాటల యుద్ధం బాగానే సాగుతోంది. ఇది జగన్‌కి తెలిసి శభాష్ అంటా రని దువ్వాడ భ్రమ! ఇక పేరాడ విషయానికి వస్తే ఈయన కొంత సాధువు. అంత దూకుడు వ్యవహారం లేని నాయకుడు, ఏదో ఒక కార్పోరేషన్ పదవి మాత్రం అందుకున్నారు. ఇక కేంద్ర మాజీ మంత్రి కృపా రాణి గత ఎన్నికల్లోనే పార్టీ టికెట్ ఆశించారు. కానీ ఇప్పుడు కాదులేమ్మా.. అని సర్దిచెప్పారు. కానీ ఈ పర్యా యం అలాంటి శాంతి వచనాలు, తర్వాత చూద్దాంలే అనే మాటకు ఆమె వెనకడుగు వేస్తారా అంటే అనుమానమే. ఇలా ముగ్గురి మధ్యా పోటీతో నియోజవకర్గ వైసీపీ క్యాడర లో అయోమయం నెలకొనే పరిస్థితిని స్వయంగా జగనే కల్పించి, కింజారపు పనైపోయిందని జబ్బలు చరుచుకుంటున్న వైనం నియోజకవర్గ ప్రజలకు పెద్ద కామెడీగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి ఒక్క టెక్కలిలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా అన్నినియోజకవర్గాలలోనూ ఉందని పరిశీలకులు అంటున్నారు.