YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

మోత్కుపల్లి పార్టీకి దూరం అవుతున్నారా...

మోత్కుపల్లి పార్టీకి దూరం అవుతున్నారా...

తెలుగుదేశంలో మరోసారి అంతర్గత పరిణామలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర శాఖ మహానాడు ఈనెల 24న హైదరాబాద్‌లో జరగనున్న నేపథ్యంలో పార్టీ నుంచి మళ్లీ వలసలు ప్రారంభమ య్యాయి. చివరికి పార్టీ ఉంటుందా ? ఊడుతుందా ? అనే సందేహాం పార్టీ వర్గాల్లో కనిపిస్తున్నది. ఇప్ప టికే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు సైలెంట్‌గా ఉండిపోయారు. ఆయన దాదాపు కోమాలో ఉన్నారని చెబుతున్నారు. టీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని బహిరంగంగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో పార్టీ సమావేశాలకు ఆయన్ను ఆహ్వానించడం బంద్‌ చేశారు. ఈనెల నాలుగున హైదరాబాద్‌లో జరిగిన చంద్రబాబు భేటికి కూడా మోత్కుపల్లికి కబురు వెళ్లలేదు. 24న జరిగే మహా నాడు ఆహ్వానితుల జాబితాలో ఆయన పేరు లేదని పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు. పార్టీ విలీనం వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటేనే, ఆయనకు పున:ప్రవేశం ఉంటుందని చెబుతున్నారు. పార్టీ నుంచి బహిష్కరిం చకపోయినప్పటికి, ప్రస్తుతం దాదాపు అదే పరిస్థితి కొనసాగుతున్నది. ఇదే స్థితి ఇంకొంత కాలం కొనసాగే పరిస్థితులు ఉన్నాయని అంటున్నవారూ లేకపోలేదు.ఏకంగా పార్టీ అధినేత చంద్ర బాబు హాజరైన రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమా వేశానికి సైతం మోత్కుపల్లిని పిలవలేదు. విలీనం వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, అప్పుడే పార్టీ కార్యకలాపాల్లో భాగస్వామిని చేస్తామని నర్సింహు లుకు పరోక్షంగా సంకేతాలు పంపినట్టు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ కార్యకర్త లకు క్షమాపణ చెప్పిన మోత్కుపల్లి, వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడానికి ససేమిరా నిరాకరించారు.  గత రెండు, మూడు నెలల కాలంలో జరిగిన ఏ కార్యక్రమానికి ఆహ్వానించలేదు. దీంతో ఆయనలోనూ అంతర్మథనం ప్రారంభమైనట్టు ఇప్పటికే ప్రచారం జరుగుతున్నది. కాగా టీఆర్‌ఎస్‌ చేరడానికి ఆయన సిద్ధమవుతున్నట్టు టీడీపీలో ఇప్పటికే చెవులు కొరుక్కుంటున్నారు. కారెక్కిన పక్షంలో ఆయనకు తుంగతుర్తి సీటుగానీ, సికిం ద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సీటుగానీ ఇచ్చేందుకు మంత నాలు జరిగాయని, అయితే ఇతమిద్దంగా ఒక నిర్ణయానికి రాలేదని సమాచారం.  ఇదిలావుండగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు, గత ఎన్నికల్లో ముఖ్య మంత్రి కేసీఆర్‌పై గజ్వేల్‌లో పోటీచేసిన ఒంటేరు ప్రతాపరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ నేతృత్వంలో ఈనెల 18న ఆ పార్టీలో చేరనున్నారు. శనివారం గజ్వేల్‌లో ఆయన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు. నియోజకవర్గ నేతలు, కార్యకర్తల అభిప్రాయం మేరకే కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రకటిం చారు. ప్రతాపరెడ్డిని కాంగ్రెస్‌లోకి రప్పించడంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ, మాజీ మంత్రి గీతారెడ్డి కీలకపాత్ర పోషిం చినట్టు తెలిసింది. ఇకపోతే మహబూబ్‌నగర్‌ జిల్లా టీడీపీ ఇన్‌ఛార్జి వెంకటేశ్వర్లు ఇటీవల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లోకి వెళ్లిన విషయం విదితమే. ఇలా మళ్లీ టీడీపీ నుంచి వలసలు ప్రారం భమయ్యాయి. ఇవి పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికొందరు కీలకనేతలు కాంగ్రెస్‌ నేతలతో చర్చలు జరుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల నుంచి టికెట్లు ఖరారు చేస్తే పార్టీ మారడానికి తమకు అభ్యంతరం లేదనే పద్ధతిలో చర్చలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ తరహాలో హైదరాబాద్‌ నగరం చుట్టూతా ఉన్న ఆయా జిల్లాల అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాలకు అధ్యక్షులుగా ఉన్నవారు ఎక్కువగా మంతనాలు చేస్తున్నావారిలో ఉన్నారని టీడీపీలోనే ప్రచారం జరుగుతోంది.

Related Posts