YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అంబటిని నిలదీసిన మహళ

అంబటిని నిలదీసిన మహళ

సత్తెనపల్లి
గడపగడపలో ప్రజాప్రతినిధులకు సమస్యల సెగ తప్పడం లేదు.   పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబుకు నిరసన సెగ తగిలింది.   తన సోదరుడి పింఛన్ ఎందుకు తొలగించారంటూ ఓ మహిళ మంత్రి అంబటిని నిలదీశారు.
తెలుగుదేశం హయాంలో వికలాంగుడికి నెలనెలా పింఛన్ వచ్చేదని.. వైకాపా అధికారంలోకి వచ్చాక పింఛన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది.  వాలంటీర్ ఉద్దేశ్యపూర్వకంగా పింఛన్ నిలిపివేశారంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా 'తొందరపడితే ఎలా ? తర్వాత వస్తుంది లే...' అంటూ మంత్రి అక్కడినుంచి వెళ్లిపోయారు. సమాధానం చెప్పకుండానే మంత్రి వెళ్లిపోయారని వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు

Related Posts