YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పదోవ తరగతి విద్యార్థులను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్నీ సాగనoపండి

పదోవ తరగతి విద్యార్థులను మోసం చేసిన జగన్ ప్రభుత్వాన్నీ  సాగనoపండి

బద్వేలు
ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన పదోవ తరగతి ఫలితాలు చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. సంవత్సరం పొడవునా చదివినా విద్యార్ధి ముఖాలు చూస్తుంటే దాయానీయమైనదిగా కనపడుతుంది అని కడప జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు,కర్నాటి శ్వేతా రెడ్డి  ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం కడప పార్లమెంట్ టిడిపి కార్యాలయంలో జరిగిన అత్యవసర విలేకరుల సమావేశం లో ఆమె మాట్లాడారు.  గత టిడిపి హయంలో 2018 లో 94. 48  శాతం ఉత్తిర్ణత సాధిస్తే జగన్ రెడ్డి  హయాంలో 67. 26 శాతానికి పడిపోయింది. చంద్రన్న రేడుసార్లు డియస్సిలు జరపగా జగన్రెడ్డి ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా జరపలేదు. ఉపాధ్యాయ నియామకాలు లేకపోవడం వల్ల విద్యార్థుల ఉత్థిర్ణిత ప్రమాణాలు దిగజారాయి. రంగులు కొట్టి కమిషన్లు దోచుకునే దానిపై చూపినా శ్రద్ధ ఉపాధ్యాయుని నియమాకాలపై పెట్టలేదు అని అన్నారు. నాడు నేడు లో 3500 కోట్ల రూపాయల ఖర్చుపెట్టినా విద్యా వ్యవస్థ ప్రధమ స్థాయిలో ఉండాల్సింది పోయి జగన్ రెడ్డి చేతగాని తనం తో 19వ  స్థాయికి చేరుకుంది అని కడప జిల్లా పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతా రెడ్డి   అభిప్రాయపడ్డారు. వైసిపి పాలనలో మొట్ట మొదటి పదోవ తరగతి ఫలితాలు కేవలం 67. 26 శాతం  మాత్రమే రావడం రాష్ట్రానికి సిగ్గుచేటు అని ఎద్దేవాచేశారు. జగన్  మోహనరెడ్డి మొదటి రెండేళ్లలో పదోవ తరగతి ఫలితాలు కరోనా ఉండడం తో నూటికి నూరు శాతం ఫలితాలు వచ్చాయి. కానీ అసలు రంగు నేడు బయట పడింది. ఆఖరికి ఫలితాలు వెలువరించేందుకు కూడా రాజకీయాన్ని జోడిoచారంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్ధం అవ్వుతుంది అని కడప పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కర్నాటీ శ్వేతా రెడ్డి  ప్రశ్నించారు. రాయలసీమ అనంతపురం లో జిల్లాల్లో అత్యల్పoగా 49.7 శాతం మాత్రమే ఉత్థిర్నీలు  అయ్యారంటే రాయలసీమ విద్య వ్యవస్థ ఎంత  గోరంగా ఉందొ అర్ధం అవ్వుతోంది అని  కర్నాటీ శ్వేతా రెడ్డి గారు చెప్పారు.  రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ రెడ్డి రాయలసీమ ప్రజలకు ఇచ్చిన బహుమతి ఇదేనా ?అని ప్రశ్నించారు. కేవలం విద్యా శాఖ మంత్రి అహంతో విద్యార్థుల ఫలితాలు ఆలస్యం చేసి అపహాస్యం చేసారు. 6.22 లక్షలు మంది గాను 4, 14, 281 లక్షలమంది ఉత్తీర్ణిత అంటే దాదాపు 2 లక్షలు మంది విద్యార్థుల భవిష్యత్ ను అంధకారం చేసినా జగన్ రెడ్డి . చంద్రబాబు నాయుడు హయం లో 94. 88 శాతం నుండి 100 శాతం వరకు రిజర్ట్ వచ్చేది. ప్రస్తుతం జగన్ ప్రభుత్వం లో 67. 26 శాతం కు పడిపోయింది. చంద్రబాబు నాయుడు హయాంలో విద్యావ్యవస్థపై అయన తీసుకున్న చొరవ ఏమిటో  అర్ధం అవ్వుతుంది. నాణ్యమైన విద్యలో చంద్రబాబు నాయుడు  హయం లో 3వ స్థానం లో ఉంటే నేడు జగన్ రెడ్డి హయం లో 19 వ స్థానం కు దిగజార్చారు. పేపర్ లీకేజి తో విద్యార్థులను క్రుంగ దీసిన జగన్ రెడ్డి . ప్రశ్న పత్రాలను వైసిపి నాయకులే లీక్ చేసి తాము తప్పించుకునే o దుకు  నారాయణ విద్యాసంస్థలు  నారాయణను ఇరికించేందుకు కుట్ర పన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులను అక్రమ అరెస్టు చేసేందుకు లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్ జగన్ రెడ్డి ఆటలాడారు. దాని ఫలితమే నేడు అత్యల్ప తక్కువ స్థాయిలో విద్యార్థులు పాస్ అయ్యారు. పదోవ తరగతి విద్యార్థులను పట్టించుకోని ప్రభుత్వం, ఏ  ప్రభుత్వం  అధికారం లోవున్నా తమ విద్యార్థులకు మంచి మార్కులు వచ్చి మంచి  భవిషత్ కు బాట వేసుకోవాలని భావిస్తుంది .కానీ జగన్ రెడ్డి తన స్వార్ధం తప్ప విద్యార్థులను పట్టించుకోలేదు. అంతేకాదు గోరంత ఇచ్చి కొండంత దోపిడీ అంటూ నేడు జగన్ రెడ్డి నాడు నేడు అంటూ పాఠశాలను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు. స్కాలర్ షిప్స్ ను ఎగ్గొట్టి అమ్మ ఒడి పేరుతో ఇస్తూ నాన్న ను గుడ్డి గా మారుస్తున్నారు. జగన్ రెడ్డి చేతగాని పాలనతో విద్యార్థుల భవిష్యత్ ను  అంధకరం లోకి నెట్టేస్తున్నారు. విద్యార్థుల చదువుకు ప్రోత్సాహకాలుగా నిలిచే పధకాలను అమలు నోచుకోవడం లేదు. ఉపాధ్యాయ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులచే లిక్కర్ అమ్మెంచేందుకు క్యూ లో  నిబెట్టిన ఘనత జగన్ రెడ్డికే దక్కిందని అన్నారు.  రంగుల పేర్లుతో వేలకోట్ల ప్రజా దనం దోపిడీ చేస్తున్నారు. గాని పాఠశాల కు వచ్చే విద్యార్థులను పట్టించుకోవడం లేదు, సరకులు కాస్మొటిక్స్  పారిశుద్యం వంటి సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు గ్యాస్ బిల్లుల సహా చెల్లించేలేకపోవడం తో హాస్టల్ లో వుండి  చదువుకోవాల్సిన విద్యార్థులు ఇంటి బాట పట్టారని ఆమె అన్నారు.

Related Posts