సత్తెనపల్లి:
రాజుపాలెం మండలం దేవరంపాడు గ్రామంలో స్వయంభువుగా వెలిసిన నేతివెంకన్న స్వామి ఆలయ అభివృద్ధికి పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు వెలగూరి శరత్ రూ 50 వేల విరాళాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మాత్యులు అంబటి రాంబాబుకు అందజేశారు. మంత్రి వర్యుల కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అంబటి మాట్లాడుతూ ప్రభుత్వ నిధులతో పాటు దాతలు స్పందించి సహకరిస్తే ఆలయాన్ని ఆదర్శంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు .
వెలుగూరి గత ఏడాది కూడా 50 వేల విరాళం ఇచ్చారున్నారు. వెలుగూరి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి 5 లక్షల విరాళాన్ని విడతలవారీగా అందిస్తానని ప్రకటించానని,ప్రతి ఏడాది రూ 50 వేల చొప్పున, ఇప్పటివరకు రూ.ఒక లక్ష నగదును అందించానాని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు చలంచర్ల సాంబశివరావు, కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, కోడిరెక్క దేవదాసు, జూపల్లి పాల్, వల్లేమ్ నరసింహారావు స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు