YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆకట్టుకుంటున్న విలాసాల నౌక..

ఆకట్టుకుంటున్న విలాసాల నౌక..

విశాఖపట్టణం, జూన్ 10,
సముద్ర విహారానికి వెళ్లాలని ఎదురు చూస్తున్న వారికి ఇదో సదావకాశం..నిజంగా చెప్పాలంటే, గుడ్‌న్యూస్‌ అనాలి. ఎందుకంటే, సాగర తీరంలో ఇప్పుడు లగ్జరీ షిప్‌ మీకోసమే వెయిట్‌ చేస్తోంది. సముద్రపు అలలపై తేలియాడుతూ కుటుంబసభ్యులతో సరదాగా గడిపే అద్భుత అవకాశం పర్యాటకులకు దక్కనుంది. సకల సౌకర్యాలతో కూడిన భారీ క్రూయిజ్ షిప్ ఎంప్రెస్ ఇప్పుడు విశాఖకు చేరుకుంది. ఈ క్రూయిజ్.. విశాఖపట్నం, పుదుచ్చేరి, చెన్నై వరకు వెళ్లి.. తిరిగి వైజాగ్ చేరుకుంటుంది.. కార్డీలియా క్రూయిజ్ కంపెనీ నడిపే ఈ షిప్.. సముద్రంలో తేలియాడే స్టార్ హోటల్‌ను తలపిస్తుంది. చెన్నై నుంచి విశాఖ చేరుకున్న కార్డీలియా క్రూయిజ్.. మూడు రాత్రులతో నాలుగు రోజుల టూర్ ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. ఈ క్రూయిజ్ షిప్ విశాఖకు చేరుకున్న సందర్భంగా బ్యాండ్ మేళాలతో ప్రయాణికులకు ఘన స్వాగతం పలికారు.విలాసవంతమైన విహార నౌక ‘కార్డేలియా’ బుధవారం ఉదయం విశాఖ పోర్టుకు వచ్చింది. నగరవాసులు క్రూయిజ్ లో ప్రయాణం చేసేందుకు ఉత్సాహం చూపడంతో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. పూర్తిగా భారత జలాల్లోనే విశాఖ-పుదుచ్చేరి-చెన్నై-విశాఖ మార్గంలో తొలిసారిగా కార్డేలియా ప్రయాణిస్తుంది.స్టార్ హోటల్‌కు మించిన సౌకర్యాలతో పర్యాటకులను అలరిస్తోంది. 796 క్యాబిన్లు, 313 ఇన్‌సైడ్‌ స్టేట్‌ రూమ్స్, 414 ఓషన్‌ వ్యూ రూమ్స్, 63 బాల్కనీ రూమ్స్, 5 సూట్‌ రూమ్‌లతో పాటు ఒక లగ్జరీ సూట్‌ రూమ్‌, ఫుడ్‌ కోర్టులు, 3 స్పెషాలిటీ రెస్టారెంట్లు, 5 బార్లు, స్పా, సెలూన్, థియేటర్, నైట్‌ క్లబ్, స్విమ్మింగ్‌ పూల్స్, ఫిట్‌నెస్‌ సెంటర్లు, డీజే ఎంటర్‌టైన్‌మెంట్, లైవ్‌ బ్యాండ్, అడ్వెంచర్‌ యాక్టివిటీస్, షాపింగ్‌ మాల్స్, లైవ్‌షోలు ఇలా సకల సౌకర్యాలతో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంది. ఇక ఇందులో సూర్యోదయం, సూర్యాస్తమయం చూసేందుకు ప్రత్యేక డెక్ ఏర్పాటు చేసారు. అక్కడి నుంచి సాగర అందాలు చూడటం ప్రత్యేక అనుభూతి అనే చెప్పాలి. 1900 మంది వరకూ ప్రయాణించగలిగే ఈ నౌకలో విశాఖ నుంచి చెన్నై వెళ్లేందుకు 36గంటల సమయం పడుతుంది.విశాఖ నుంచి రాత్రి ఎనిమిది గంటలకు బయలుదేరి తొమ్మిదో తేదీ మొత్తం సముద్రంలోనే ప్రయాణిస్తుంది. 10 వ తేదీ ఉదయం ఏడు గంటలకు పుదుచ్చేరి చేరుకుంటుంది. పుదుచ్చేరిలో రాత్రి ఏడు గంటల వరకు పర్యటించవచ్చు. ఆయా ఏర్పాట్లు కూడా సంస్థే చేస్తుంది. పుదుచ్చేరి లో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి మరుసటి రోజు (నాలుగో రోజుకు) చెన్నై కు చేరుకుంటుంది. ఎంప్రెస్‌ విదేశీ విహార నౌక అయినప్పటికీ దీన్ని ప్రస్తుతం భారత దేశంలో మాత్రమే తిరిగేలా నిర్వాహకులు అనుమతులు పొందారు. దీంతో పాస్‌పోర్ట్‌ అవసరం లేదు. కస్టమ్స్‌ తనిఖీలు ఉండవు.విశాఖ నౌకాశ్రయానికి గతంలో కూడా కొన్ని నౌకలు వచ్చినా ప్రస్తుతం ఈ నౌకకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటున్నారు. ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ రూం, ఓషన్‌ వ్యూ స్టాండర్డ్‌ రూం, మినీ సూట్‌ రూం, సూట్‌ రూం పేరిట నాలుగు విభాగాలు నౌకలో ఉన్నాయి. ఒక్కో విభాగానికి ఒక్కో ధరను నిర్ణయించారు. అదే నౌక జూన్‌ 15 న, 22 వ తేదీన కూడా వస్తుంది. భారత సాగర తీరాల్లో మాత్రమే తిరిగే విహార నౌక కావడంతో అందులోని పర్యాటకులలో దాదాపు అందరూ భారతీయులే ఉంటారు. టికెట్ల విక్రయాలతో నౌకాశ్రయానికి సంబంధం లేదని విశాఖ నౌకాశ్రయం అధికారులు వెల్లడించారు.

Related Posts