కడప, జూన్ 10,
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక హై ప్రొఫైల్ కేసులోనే సాక్షి అనుమానాస్పద స్థితిలో మరణించడం ఏమిటి? అసలేం జరుగుతోంది ఏపీలో. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు స్వయాన చిన్నాన్న వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు సీబీఐ దర్యాప్తు చేస్తున్నసంగతి తెలిసిందే. సీబీఐ దర్యాప్తులో పలు సంచలన అంశాలు వెలుగు చూస్తున్న తరుణంలో ఈ కేసులో సాక్షిగా వున్న వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం కలకలం రేపుతోంది. చిత్రమే మంటే సినిమాటిక్‌గా ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం. గతంలో పరిటాల రవి కేసులో సాక్షులు వరుసగా ఇలానే మృతి చెందడాన్ని గుర్తు చేస్తూపలువురుకేసు ఎలా సాగుతుందన్న దానిపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకే బెదరింపులు రావడం తెలిసిందే. అసలు రాజకీయ నాయకులకు సంబంధించిన కేసుల్లోనే ఇటువంటి పరిస్థితి గురించి వినడం, చూడటం పోలీసువర్గాల మీద నమ్మకం తగ్గిస్తుంది. మంత్రి వై.ఎస్.వివేకా నంద రెడ్డి హత్యకేసు ఇప్పటికే మలుపులు తిరి గింది. ఇపుడు ఆ కేసుకు సంబంధించిన సాక్షి గంగా ధర్ రెడ్డి బుధవారం రాత్రి మృతి చెందడంతో కేసు మరో కీలక మలుపు తిరిగిందనే అనాలి. అనంతపురం జిల్లా యాడికి కి చెందిన గంగాధర్ తన నివాసంలో మరణించేడు. గురువారం ఉదయం లేవ లేదు. కుటుంబసభ్యులు వైద్యుల్ని సంప్రదించగా అతను పల్స్‌రేట్ పడిపోవడం వల్లనే మరణించినట్లు ప్రకటించేరు. పోలీసులు ఈ మరణం సహజ మరణం కాదని తేల్చేరు. కేసు విషయానికి వస్తే, వివేకానందరెడ్డి హత్య జరిగి మూడేళ్లయింది. కానీ అసలు సూత్రధారలు ఎవరన్న ది సిబిఐ ఇప్పటి వరకూ తేల్చలేకపోయింది. ఈ కేసులో వివేకా మాజీ కారు డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. అప్పటి నుంచి తన ప్రాణాలను కాపాడాలని పోలీసులకు మొరపెట్టుకుంటూనే వున్నాడు. ఏ క్షణాన తనకు ఏమవుతుందోనన్న భీతిలోనే బతుకుతున్నాడు. పోతే, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారు లపై ఉల్టా కేసు పెట్టడమేకాకుండా, వారి డ్రైవర్‌నీ బెదిరించడం మరీ చిత్రం. సీబీఐ వారు దేన్ని అనుమానించక వదలరు. రెండు రోజుల క్రితమే పులివెందులలోని ఏపీ సీఎం జగన్ క్యాంపు కార్యాలయానికి దగ్గరలోనే వున్న ఎం.పీ అవినాష్ రెడ్డి, వివేకా నివాసంలో, పరిసరాల్లో మళ్లీ తని ఖీలు చేపట్టడమేకాకుండా ప్రభుత్వ సర్వేయర్‌తో నివాసాల కొలతలను తీయించేరు. సీబీఐ దర్యాప్తు కాస్తంత వేగిరంగా కానిస్తోంది అనుకున్నారు. ఇంతలో గంగాధర్ రెడ్డి అసహజ మరణం ప్రాధాన్యత సంతరించుకుంది.
గంగాధర్ అనుమానాస్పద మృతి గురించి వింటూంటే గతంలో టీడీపీ నేత మాజీమంత్రి పరిటాల రవి హత్య కేసులో ముద్దాయిగా ఉన్న మొద్దు శీనుకు, శీనును హత్య చేసిన ఓంప్రకాశ్ లకు జరిగినట్లే వివేకా హత్య కేసులో కూడా సీన్ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.