కాకినాడ
స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదురుగా వున్న పూరిళ్లను అధికారులు శుక్రవారం తొలగించడానికి పూనుకున్నారు. వారిని స్థానికులు అడుకున్నారు. వీరు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి పాకలు వేసుకున్నారని, ఇప్పటికే ఈ 90 మందికి పండూరు లో ఇళ్ళు కేటాయించామని అధికారులు చెబుతున్నారు. అయితే రాత్రి రాత్రి పట్టాలు ఇచ్చి ఉదయం ఎలా ఖాళీ చేస్తామని బాధితులు అడుగుతున్నారు. మున్సిపల్ కమిషనర్ పోలీసులు, సచివాలయ సిబ్బందితో ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులను జనసేన నేతలు అడ్డుకునే ప్రయత్నం చేసారు. దాంతో జనసేన రాష్ట్ర పి.ఏ.సి సభ్యుడు పంతం నానాజీ ను సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితుల ఇంట్లో సామనులన్ని రోడ్డు పైన వేయడం వివాదస్పదమయింది.