తిరుపతి
ఎన్టీఆర్ బొమ్మను వంద రూపాయల నాణెంపై ముద్రించేందుకు ఆర్బిఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి తెలిపారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మ ఉన్న వంద రూపాయల నాణెం ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్నారు. తిరుపతి అంటే ఎన్టీఆర్ కు ఎంత ఇష్టమని.. రాజకీయ జీవితాన్ని తిరుపతి నుంచే ఆయన ప్రారంభించారని పురందరేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు మరో పది నెలల పాటు వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తామని.. ఎన్టీఆర్ ను అభిమానించే ప్రతి ఒక్కరు శత జయంతి వేడుకలకు రావాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుపతిలో జరిగిన శత జయంతి వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.