తిరుపతి
రిటైర్ అయిన తరువాత ఎన్టీఆర్ పై పుస్తకం రాస్తానన్నారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ ఎన్టీఆర్ కు తిరుపతితో ఎంతో అనుబంధం ఉందన్నారు. ఎన్టీఆర్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ అని..ఆయన ఓ సమగ్ర సమతా మూర్తి అని కొనియాడారు. రైతుబిడ్డగా, రంగస్థల నటుడిగా, కథానాయకుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ఎదిగారు..ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అన్నారు.