YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లోకేష్ జూమ్‌ మీటింగ్ లో చొరబాటుపై సీఐడీకి కంప్లైంట్

లోకేష్ జూమ్‌ మీటింగ్ లో చొరబాటుపై సీఐడీకి కంప్లైంట్

విజయవాడ, జూన్ 10,
ఏపీలో ట్వీట్ల వార్ తో పాటు కొత్త వివాదాలు తెరమీదకు వచ్చాయి. ట్వీట్లతో వైసీపీ-టీడీపీ నేతలు రెచ్చిపోతుంటే.. తాజాగా జూమ్ మీటింగ్‌ లలో అధికార పార్టీ నేతలు చొచ్చుకురావడంపై వివాదం రేగింది. దీనిపై రాజకీయ రగడ కొనసాగుతోంది. టీడీపీ జూమ్ కాన్ఫరెన్సులో వైసీపీ నేతలు జొరబడ్డ ఎపిసోడుపై సీఐడీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగులోకి మాజీ మంత్రి కొడాలి నాని, వైసీపీ ఎమ్మెల్యే వంశీ సహా వైసీపీ నేతలు జొరబడడంపై సీఐడీ చీఫ్ సునీల్ కుమారుకు లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య.ఫిర్యాదులో వర్ల రామయ్య అనేక అంశాలు ప్రస్తావించారు. రెండు రాజకీయ సమూహాల మధ్య గొడవలు పెట్టేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు.కొడాలి నాని, వంశీ, కొత్తపల్లి రజనీ, దేవేందర్ రెడ్డిలు వేరే వారి పేర్లతో లోకేష్ జూమ్ కాన్ఫరెన్సులోకి వచ్చారు. వల్లభనేని వంశీ, కొడాలి నానీలు లోకేష్ తో గతంలోనే పూర్తిగా వైరుధ్యం కలిగి ఉన్నారు. నాని, వంశీ చర్యలు నేరపూరిత కుట్రగా కనిపిస్తున్నది. గొడవలు పెట్టాలని ప్రయత్నించిన నాని, వంశీలపై నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.వీలైనంత త్వరగా విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి.పదో తరగతిలో ఫెయిలైన విద్యార్థులతో లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్‌లోకి చొరబడ్డారు.కొంతమంది వైసీపీ నేతలు ఆహ్వానం లేకుండానే తప్పుడు పేర్లతో లాగిన్ అయ్యి మీటింగ్‌లోకి చొరబడ్డారు.అనుచిత పదజాలంతో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.రాజకీయంగా గతంలో సైతం వీరు అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు.నేరపూరిత కుట్రతో జూమ్ మీటింగులోకి అక్రమంగా చొరబడ్డారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు వర్ల రామయ్య.

Related Posts