YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

గుజరాత్ వేగంగా అభివృద్ధి

గుజరాత్ వేగంగా అభివృద్ధి

గాంధీనగర్ జూన్ 10,
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ప్రధాని మోదీ ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 2 నెలల్లోనే నాలుగు సార్లు గుజరాత్‌లో పర్యటించిన మోదీ.. తాజాగా శుక్రవారం దాదాపు రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్‌సారిలో జరిగిన ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు.రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే తనకు దేశానికి సేవ చేసే భాగ్యం కలిగిందని మోడీ పేర్కొన్నారు. ఇన్నేళ్ల కాలంలో గిరిజన ప్రాంతంలో ఇలాంటి పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగలేదంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు. అదివాసీ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టినట్లు మోడీ వివరించారు. గుజరాత్‌లో గత రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి జరిగిందని.. ఇది దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అందరి అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని తెలిపారు. రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం లభించడం గర్వకారణమని మోదీ పేర్కొన్నారు.ప్రధాని మోడీ గుజరాత్‌లో రూ. 3,050 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. నవ్‌సారిలో పర్యటించిన ప్రధాని మోడీ.. ‘గుజరాత్ గౌరవ్ అభియాన్’ లో భాగంగా బహుళ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మాట్లాడారు. గుజరాత్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు గర్వపడుతున్నానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు గర్వంగా ఉందని.. గుజరాత్ ప్రజలతోనే తనకు దేశానికి సేవ చేసే భాగ్యం కలిగిందని మోడీ పేర్కొన్నారు. ఇన్నేళ్ల కాలంలో గిరిజన ప్రాంతంలో ఇలాంటి పెద్ద కార్యక్రమం ఎప్పుడూ జరగలేదంటూ ప్రధాని మోడీ పేర్కొన్నారు. అదివాసీ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టినట్లు మోడీ వివరించారు.తాను గుజరాత్‌ను విడిచిపెట్టిన తర్వాత, ఆ బాధ్యతను స్వీకరించిన భూపేంద్ర భాయ్, సిఆర్ పాటిల్ ఉత్సాహంతో.. ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని కలిగించినందుకు గర్వపడుతున్నానని ప్రధాని పేర్కొన్నారు. గుజరాత్‌లో గత రెండు దశాబ్దాల్లో వేగంగా అభివృద్ధి జరిగిందని.. ఇది దేశానికి గర్వకారణమని ఆయన అన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అందరి అభివద్ది కోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతుందని తెలిపారు. రూ. 3,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసే అవకాశం లభించడం గర్వకారణమన్నారు.ఈ ప్రాజెక్టులన్నీ సూరత్, తాపి, నవ్‌సారి, వల్సాద్‌తో సహా దక్షిణ గుజరాత్‌లోని కోట్లాది మంది ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, నీరు, రోడ్లు, వైద్యం, విద్య ఇలా అన్ని రకాల సంక్షేమ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని పేర్కొన్నారు.ఈ ప్రాజెక్టులన్నీ సూరత్, తాపి, నవ్‌సారి, వల్సాద్‌తో సహా దక్షిణ గుజరాత్‌లోని కోట్లాది మంది ప్రజల జీవితాన్ని సులభతరం చేస్తాయన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో విద్యుత్, నీరు, రోడ్లు, వైద్యం, విద్య ఇలా అన్ని రకాల సంక్షేమ ప్రాజెక్టులు ఉపాధి అవకాశాలను పెంచుతాయని పేర్కొన్నారు. బీజేపీ సర్కార్ 8ఏళ్ల పాలనను ప్రస్తావిస్తూ.. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌ నినాదంతో తమ ప్రభుత్వం పేదల సంక్షేమం, కనీస సౌకర్యాలు కల్పించడంపై అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందని మోదీ పేర్కొన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అభివృద్ధిపై ఎవరూ దృష్టిసారించలేదంటూ ప్రధాని విమర్శలు గుప్పించారు

Related Posts